టైం అవుతుంది అనే హడావిడిలో వచ్చేసాను అమ్మ అని డ్రెస్ వేసుకొని బయటకి వచ్చిన శృతి అక్క వీపుపై ఒక్కటేసి బయట గొళ్ళెం ఎందుకు పెట్టావ్ అని అరుస్తుంటే నేను పెట్టుకున్న వేడి నీళ్లతో నువ్వెందుకు చేశావ్ అని అరుచుకుంటూ టైం ని స్వాహా చేశారు…
ఇద్దరి అరుపులు భరించలేని సులోచన గారు ఇద్దరిని మొట్టి టైం ఇక్కడే పావు తక్కువ తొమ్ముది అవుతుంది ఎప్పుడే మీరు కాలేజ్ కి వెళ్ళేది అని అరవడం తో ఫాస్ట్ గా రెడీ వచ్చి నేను వెళ్తున్న అని బ్యాగ్ పట్టిన శృతికి రెండు తిట్లు మూడు మొట్టికాయలు నాలుగు పొంగణాలు తినిపించి పంపించారు…
శృతి కాలేజ్ దగ్గరే అయినా బై వాక్ అయ్యే సరికి లేట్ అయింది తనకి…
ఫాస్ట్ ఫాస్ట్ గా బాత్రూమ్ లో దూరి నాలుగు చెంబుల నీళ్లు పోసుకొని మమ అన్నట్టు స్నానం ముగించుకొని ఇంట్లోకి వచ్చి రెడీ అయ్యే సరికి టైం తొమ్మిది ఇంట్లోనే అవుతుంది…