నీ దృష్టిలో కొంచెం అంటే 15 మినిట్స్ లేట్ హా! 9 గంటల క్లాస్ అంటే 9:15 కి రావడమేనా??? కాలేజ్ అనుకున్నావా లేక క్యాంటిన్ అనుకుంటున్నావా నీ ఇష్టానికి రావడానికి… సారీ చెప్తే పోయిన పదిహేను నిమిషాల ప్రొడక్టివిటీ తిరిగి వస్తుందా శాన్వి?
బిజినెస్ వరల్డ్‌లో టైమ్ అంటే మనీ… నువ్వు ఒక ఇన్వెస్టర్ మీటింగ్‌కి ఇలాగే పదిహేను నిమిషాలు లేటుగా వెళ్లి సారీ చెప్తే… వాళ్లు నీ ప్రాజెక్ట్‌ని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేస్తారు… నీ సారీ ఏమ్ వాళ్ళకి కోట్లు తెచ్చి పెట్టదు అర్థమవుతుందా!!!! అని శాన్వి కి చెప్పి రెండు అడుగులు వెనక్కి వేసి క్లాస్ అందరిని చూస్తూ గ్లోబల్ అకాడమీలో అడుగు పెట్టారు అంటే ముందుగా మీకు ఉండాల్సింది పంక్చువాలిటీ!! ఇది కేవలం ఒక రూల్ కాదు… ఒక బిజినెస్ ఐకాన్ కి ఉండాల్సిన కనీస ధర్మం. సమయాన్ని గౌరవించని వాడు, తన కెరీర్‌ని తానే నాశనం చేసుకుంటున్నట్టు లెక్క అని చెప్పడంతో….
క్రిష్ గొంతు క్లాస్ రూమ్ అంతా ఆర్డర్ వేసినట్టుగా ప్రతిధ్వనించింది.. ఆ దెబ్బకి క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ వెన్నుముక నిటారుగా నిలబడింది… ఎవరూ కనీసం కదిలే ధైర్యం కూడా చేయడం లేదు… కానీ ప్రతి సారి అందరి ముందు అలా నీలదిస్తున్నట్టు అడుగుతుంటే ఏమ్ మాట్లాడలేక తల దించుకుని పావుగంట లేట్ వస్తే పది నిమిషాలు క్లాస్ పీకుతూ అరగంట వేస్ట్ చేస్తున్నావ్ రా యంగ్ లెక్చరర్ అని మనసులో తిట్టుకుంటుంది…
లోపలికి వచ్చి నీ రికార్డ్ సబ్మిట్ చేయ్ అన్నాడు తిరిగి తన ప్లేస్ లోకి వెళ్తూ…