పర్లేదు ఆంటీ.. అంకుల్ ఎందుకు డిశ్చార్జ్ చేయించుకుని మేమ్ తీసుకు వస్తాం మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంది…
నేను శృతి ని తీసుకు వెళ్తానే.. ఆడపిల్లవి ఈ టైం లో ఒంటరిగా ఎలా వదిలేస్తాం మీ అంకుల్ ఉంటారు అని శృతి వెళ్దాం రా అంది…
శృతి శాన్వి వైపు చూస్తుంటే వెళ్ళు అన్నట్టుగా కళ్ళతో సైగ చేయగానే హ్మ్ అని కళ్లార్పి సునీత గారితో బయలు దేరింద శృతి…
పక్కన గీత ఫాదర్ ఉండటంతో ఫోన్ ఆన్ చేస్తే బాగోదని స్క్రీన్ ఆన్ చేయలేదు ఇక శాన్వి…