టైం చూస్తే అప్పటికి 10 అవుతుంది ఈ టైం లో కాల్ చేసి కృతి ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్న శాన్వికి మరో అరగంట దాటాక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఈ టైం లో ఎవరు అనుకుని లిఫ్ట్ చేయాలా వద్దా అని అనుకొని లాస్ట్ రింగ్ లో లిఫ్ట్ చేసి హాలో అంది…
హలో అని అటు వైపు నుండి మృదువైన స్వరం వినిపించగానే భయంతో ఎవరు అంది….
హేయ్! కూల్ శాన్వి ఎందుకలా టెన్షన్ పడుతున్నావ్ అని మరింత సాఫ్ట్ వాయిస్ వినిపిస్తుంటే…
శాన్వి టెన్షన్ మరింతగా పెరిగి పోయి వెంటనే కాల్ కట్ చేసింది…