ఇంటికి వెళ్ళినా ప్రణవి కిచెన్ లోకి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుని మొత్తం ఖాళీ చేసేస్తుంది అది చూసిన చంద్రిక గారు అదేంటే అంతా దాహంతో ఉన్నావా అంటారు
ప్రణవి : అవును పిన్ని చాలా దాహంగా అనిపించింది హనీ కంగారుగా చెప్తూ పిన్ని నాకు అసైన్మెంట్ ఇచ్చారు నేను ఫ్రెష్ అప్ అవి చేసుకుంటాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది
తన గదిలోకి వచ్చి కూర్చొని ఆర్యన్ కోసమే ఆలోచిస్తుంది ఇదేమిటి అతను అలా ప్రవర్తిస్తున్నాడు.. అని ఆర్యన్ మాటలని గుర్తు చేసుకుంటుంది ఆర్యన్ తన దగ్గరకు వచ్చి స్వీటీ అని పిలిచిందే వినిపిస్తుంది తన ప్రాగ్రాజ్ ఇంకా తన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంది ప్రణవికి అదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది ఆర్యాన్ని కార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే తన మనసుకి దగ్గరగా అనిపిస్తుంది కానీ అప్పుడు పట్టించుకోలేదు ఆర్యన్ తనతో అలా మాట్లాడటం అంత దగ్గరగా ఉండటం భయంగా అనిపించిన తన మనసుకి చాలా నచ్చింది కానీ మెదడు మాత్రం తన కుటుంబాన్ని గుర్తు చేసింది ప్రణవి ఆర్యన్ ఆలోచనల నుండి బయటకు వచ్చి లేదు నేను ఇలా ఆలోచించడం తప్పు నాకు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమన్నా ఉంది అంటే అది చదువు మాత్రమే నాకు చదివే ముఖ్యం నామీద నమ్మకంతో నాన్న వాళ్ళు ఎక్కడ వరకు పంపించి నన్ను చదువుకొనిస్తున్నారు దానిని నేను దుర్వినియోగం చేసుకోకూడదు లేదు నేను ఎవరి గురించి ఆలోచించను నాకు చదువు తప్ప ఇంకేమీ వద్దు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది
తనకి తన కుటుంబం కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళని తలుచుకొని లేదు నాకు నా కుటుంబమే ముఖ్యం నా చదివే ముఖ్యం అని బలంగా నిర్ణయించుకుని ఆర్యన్ ఆలోచనలు వదిలేసి వెళ్లి ఫ్రెష్ అప్ అవి బుక్స్ తీసుకొని ముందు కూర్చుంటుంది రాబోయే ఎగ్జామ్స్ కోసం మళ్లీ చంద్రిక గారు వచ్చి డిన్నర్ కి పిలిచే వరకు అలాగే కూర్చుంటుంది…..