New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 1

💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 1

​హైదరాబాద్ నగరం ఉదయం ఎనిమిది గంటలకే పరుగులెడుతోంది. ఆ హడావుడిలో ఐటి కారిడార్‌లోని ఒక కాఫీ షాప్ బయట నిలబడి, కంగారుగా దిక్కులు చూస్తోంది రుక్మిణి….. 

 

చేతిలో ఒక ఫైల్ పట్టుకుని, చేతులు వణికిపోతుంటే పెదవులు కొరుకుతోంది.. తండ్రి అనారోగ్యం వల్ల సిటీలోని ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వచ్చింది…. అసలే అమాయకురాలు, ఆపై సిటీ వాతావరణం కొత్త కావడంతో ఊపిరి సలపనట్టుగా ఉంది………

 

 

అమ్మా… నా వల్ల అవుతుందా? అంత పెద్ద కంపెనీ అంట. నన్ను అసలు లోపలికి రానిస్తారా? మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది….

 

అంటే మన రుక్మిణి అమ్మవారు భక్తురాలు….

 

​సరిగ్గా అదే సమయంలో… రోడ్డు మీద ఒక నల్లటి మెర్సిడెస్ బెంజ్ కార్ వచ్చి ఆగింది…కార్ డోర్ ఓపెన్ అయింది. పర్ఫెక్ట్ బ్లాక్ సూట్, బ్రాండెడ్ సన్ గ్లాసెస్, చేతికి కాస్ట్‌లీ వాచ్‌తో దిగాడు విక్రమ్, అతడిని చూడగానే చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా గౌరవంగా పక్కకు తప్పుకున్నారు……….

 

అది విక్రమ్ ‘క్లాస్’ లుక్.

 

కానీ కార్ దిగీ దిగడంతోనే, ఒక లోకల్ రౌడీ షీటర్ తన గ్యాంగ్‌తో విక్రమ్ దారికి అడ్డంగా నిలబడ్డాడు… ఏయ్ విక్రమ్, మా ల్యాండ్ సెటిల్మెంట్ మ్యాటర్ నీకెందుకురా? అన్నాడు ఆ రౌడీ…………

 

విక్రమ్ నవ్వి, తన సన్ గ్లాసెస్ తీసి కార్ బ్యానెట్ మీద పెట్టాడు… ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు  ముందడుగు వేసి ఆ రౌడీ కాలర్ పట్టుకుని, గాల్లోకి లేపి రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీ మీద పడేశాడు………..

 

మిగతా ఇద్దరిని కేవలం రెండు నిమిషాల్లో కింద పడేసి, దుమ్ము దులుపుకున్నాడు……ఇది విక్రమ్ ‘మాస్’ యాంగిల్………..

 

​చుట్టూ ఉన్నవాళ్లంతా నోరెళ్లబెట్టారు. కానీ రుక్మిణి మాత్రం ఆ ఫైట్ చూసి భయంతో వణికిపోయింది. కళ్ళు గట్టిగా మూసుకుని ఓ మూలకి నక్కి నిలబడింది…………..

 

విక్రమ్ మళ్లీ చాలా కూల్‌గా తన సూట్ సరిచేసుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని కంపెనీ బిల్డింగ్ వైపు నడవడం ప్రారంభించాడు… సరిగ్గా బిల్డింగ్ ఎంట్రన్స్ వద్ద కంగారులో లోపలికి పరిగెడుతున్న రుక్మిణి , విక్రమ్‌ను బలంగా ఢీకొట్టింది………..

 

​ఆమె చేతిలోని ఫైల్స్, సర్టిఫికెట్స్ అన్నీ కింద పడిపోయాయి………

 

ఐ… ఐయామ్ సారీ… క్షమించండి…అంటూ భయంతో రుక్మిణి కింద కూర్చుని పేపర్లు ఏరుకోవడం మొదలుపెట్టింది…కానీ విక్రమ్ ఫేస్ ని మాత్రం చూడలేదు…..

 

అప్పుడే ఆమె కళ్ళల్లో  నీళ్లు ముత్యాలులా మెరుస్తున్నాయి…..

 

​విక్రమ్ కింద పడ్డ పేపర్ల వైపు, ఆ తర్వాత వణుకుతున్న రుక్మిణి వైపు చూశాడు…. ఎప్పుడూ ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడని విక్రమ్ గుండెల్లో, ఆ అమాయకపు కళ్ళను చూడగానే ఏదో తెలియని కొత్త ఫీలింగ్…చాలా సాఫ్ట్‌గా ఉన్న ఆమె ముఖం అతడిని కట్టిపడేసింది………..

 

విక్రమ్ కూడా కిందకి వంగి ఒక పేపర్ తీసి ఆమెకు అందించాడు. ఆమె చేతి వేళ్లు అతడి చేతికి తగలగానే రుక్మిణి ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది………….

 

చూసుకుని నడవచ్చుగా? అన్నాడు విక్రమ్ గంభీరమైన గొంతుతో………..

 

ఇక రుక్మిణి  అయితే, విక్రమ్ గంభిరమైన గొంతుకి

ఇంకా భయపడిపోయి, సారీ సార్… అని చెప్పి అతని వైపు చూడకుండానే పేపర్లు తీసుకుని లోపలికి పరిగెత్తింది………

 

విక్రమ్ లేచి నిలబడి, ఆమె వెళ్తున్న వైపు చూస్తూ పెదవులపై ఒక చిన్న నవ్వు చిందించాడు…. ఇంట్రెస్టింగ్… ఎవరీ పిల్లికూన? అనుకుంటూ లోపలికి వెళ్లాడు……….

 

​కంపెనీ కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తున్న రుక్మిణి ఒక పెద్ద క్యాబిన్ ముందు ఆగింది, అక్కడ గోడకు ఉన్న నేమ్ ప్లేట్ బోర్డు పై… 

 

విక్రమ్ రాథోడ్ మేనేజింగ్ డైరెక్టర్ 

అనే పేరు చాలా అందంగా, మెరిసిపోయే గోల్డ్ అక్షరాలతో రాసి ఉంది………

 

ఆ పేరు చూడగానే రుక్మిణి మనసులో ఏదో తెలియని ఒక మంచి అనుభూతి కలిగింది.. అబ్బా… పేరు ఎంత బాగుందో! బోర్డు ఇంత అందంగా ఉందంటే… లోపల ఉండే ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా చాలా క్లాస్ గా, సౌమ్యంగా, దైవస్వరూపుడిలా ఉంటారు కాబోలు…….

 

అని తన అమాయకపు మనసులో ఒక అందమైన ఊహ ఊహించుకుంది. తెల్లటి పంచె కట్టుకుని, ముఖాన చిరునవ్వుతో, అందరినీ ఎంతో ఆదరంగా పలకరించే ఒక పెద్దాయన రూపం ఆమె కళ్లముందు కదలాడింది…………..

 

దాంతో, ఇందాక బయట జరిగిన ఆ భయంకరమైన గొడవను, ఆ రఫ్ మనిషిని కాసేపు పూర్తిగా మర్చిపోయి, ఒక ప్రశాంతమైన ఊపిరి పీల్చుకుంది. తన కంగారంతా మాయమైపోయినట్టు అనిపించింది…………….

 

రుక్మిణి తన మనసులో ఆ మేనేజింగ్ డైరెక్టర్ ‘విక్రమ్ రాథోడ్’ ఒక దేవదూతలా, తెల్లటి పంచె కట్టుకుని ముఖాన చిరునవ్వుతో ఉంటాడని ఊహించుకుంటూ………..

 

క్యాబిన్ డోర్ వైపు అడుగులు వేసింది, డోర్ దగ్గర ఉన్న సెక్రటరీ రుక్మిణి ఫైల్ చూసి, నువ్వేనా రుక్మిణివి? హా…. మేడం…. ఓకే….సర్ లోపల నీ కోసమే వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు, 

అని చెప్పింది…………

 

​To be continued…✍️