కొడుకు వెనక నే వెళ్లి అది కాదురా రేపు అక్క బర్త్డే కదా దానికి శారీ తీసుకున్న బ్లౌజ్ కుట్టించి మీ నాన్న నేను వెళ్దాం అనుకుంటున్నాం ప్రతి శారీ దానే రమ్మని అంటే బాగోదు కదా
అబ్బా అమ్మ నాకు అస్సలే చిరాకు గా ఉంది అంటే ఏంటి నువ్వు అని అసహనం గా సరే రా తీసుకోని వెళ్తాను అని భయటకి వచ్చి తన బైక్ తీశాడు.
దేవి గారు వచ్చి కూర్చడంతో స్టార్ట్ చేశాడు.
బైక్ డ్రెవ్ చేస్తూనే ఇప్పుడు మళ్ళీ దాని దగ్గిరకి వెళ్తే దాని కోసం వచ్చాను అనుకుంటుంది ఏమో అని అయిన దాని కోసం వెళ్లడం లేదు…. అయిన దీనికి పొగరు ఎక్కువ అయింది నా కోసం ఒక గంట భయటకి రాలేదా నా కన్నా దాని బోడి షాప్ ఎక్కువ అని జీవ నీ తిట్టుకుంటూ జీవ షాప్ రావడం తో బైక్ ఆపాడు.