క్రిష్ణ తులసి – 2
క్రిష్ణ తులసి పార్ట్ 2
“కన్నా బ్రేక్ ఫాస్ట్ రెడీ, కమ్ ఫాస్ట్..!” డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి కొడుకుని పిలిచింది హేమ.
“కమింగ్ అమ్మ..!” సగం తెలుగు, సగం ఇంగ్లీష్ కలిపి రెండు భాషలకి న్యాయం చేస్తూ స్టెప్స్ దిగి డైనింగ్ ఏరియాకి వచ్చాడు ఆమె కొడుకు.
లైట్ స్కై బ్లూ షర్ట్, బ్లాక్ ఫార్మల్ ప్యాంటు చేతిలో వైట్ ల్యాబ్ కోట్, మెడలో స్టెత్ వేసుకొని నడచి వస్తున్న కొడుకుని చూసి, కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమెకి.
మనసు పొరల్లో మరుగున పడాలసిన ఇరవై ఏళ్ల నాటి మాటలు నేటికీ తాజాగా వినిపిస్తూనే ఉన్నాయి.
“ఏంటి అమ్మా, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా…! చిల్ మనసుకి కష్టం అయినా మాటలని మనుషులని డిలీట్ చేస్తేనే, మన మైండ్ యాంటి వైరస్ ఉన్న సిస్టమ్ లా కరెక్ట్ గా పని చేస్తుంది.
లేకపోతే స్ట్రెస్ అనే పెద్ద కొండ మన హెడ్ మీద వెయిట్ పెంచుతూనే పోతుంది. సో నువ్వు అర్జంట్ గా ఆ ఒక పెద్ద హ్యామర్ తీసుకోని ఆ కొండని బ్రేక్ చేసేయ్.
లైఫ్ చాలా చిన్నది మా..! మనం ప్రతి సెకండ్ అప్డేట్ అవుతూ దాన్ని ఎలా హ్యాపీగా ఉంచాలో డిసైడ్ చేసుకోవాలి కానీ, ఫస్ట్ లోనే ఆగిపోతే, ఫ్యూచర్ ఇచ్చే మెమోరీస్ కి స్పేస్ సరిపోదు. సో అర్జంట్ గా ఆ జంక్ అంత డిలీట్ చేసేయ్.” నవ్వుతూ అన్నాడు అతను.
“నాకు నువ్వే పెద్ద స్ట్రెస్ బస్టర్ బంగారం. నీతో మాట్లాడితే చాలు నా స్ట్రెస్ అంత అలా మాయం అయిపోతుంది.” నవ్వుతూ అంది హేమ.
“ఆహా అలానా, ఐతే నా ఓపి ఫీజ్ ఎంతో నీకు తెలుసు కదా..! రేపటి నుండి బ్రేక్‌ఫాస్ట్ తో పాటు, ఆ మనీ కూడా రెడీగా పెట్టుకో,
అండ్ వన్ మోర్ థింగ్ నా పేరు ఏంటి…?” అని అడిగాడు అతడు తల్లి పెట్టిన టిఫిన్ చేస్తూనే…!
“ఏంట్రా నా దగ్గర కూడా మనీ వసూల్ చేస్తావ్, చేసుకో పర్లేదు. నా కొడుకు, ఇంకా మా ఆయన బానే సంపాదిస్తున్నారు.” తగ్గకుండ అంది హేమ.
“అవును ఇంతకీ డాడీ ఎక్కడ అమ్మ…!” చుట్టూ చూస్తూ అడిగాడు అతడు.
“రేయ్ ఆ ముక్కలు ముక్కల భాష ఏంట్రా…! మీ డాడీ ఎర్లీ మార్నింగ్ సిడ్నీ వెళ్ళారు. ఎదో అర్జంట్ బిజినెస్ ట్రిప్ కోసం…!”
“ఎమ్ చేయమంటావ్ అమ్మ, నీకోసం డాడీ కోసం తెలుగు స్కిప్ చేయకుండా ఉండటానికి ట్రై చేస్తున్నానా, ఈ విదేశంలో బయటకి పొతే మొత్తం ఇంగ్లీష్,
సో ఇక్కడ ఇలా, అక్కడ ఆలా మాట్లాడి, నా తెలుగు అలా అయిపోయింది.
అయినా యు శుడ్ ఫీల్ ప్రౌడ్ నేను తెలుగు లో టాక్ చేస్తున్నందుకు.” గొప్పగా చెప్పాడు అతడు.
కొడుకు మాటలని మురిపెంగా వింటూ…! అతని బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అవ్వడంతో, ముందే రెడీ చేసిన టీ ఫ్లాస్క్ లో నుండి పోసి ఇచ్చింది.
లవ్ యు అమ్మ..! తల్లికి ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ఆ టీ సిప్ చేస్తూ దాని రుచిని ఎంజాయ్ చేస్తూ…!
“మామ్ నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు.” అని గుర్తు చేసాడు అతడు.
“హ్మ్మ్, నీ పేరు తులసి రామ్..! నేను ఇష్టం తోనే చాలా వెతికి వెతికి ఆ పేరు పెట్టాను. ఐతే మాత్రం కన్నా, బంగారం అని పిలవకూడదా..?” కొడుకు మాటలు ఎక్కడికి దారి తీస్తాయో తెలిసి అంది హేమ.
“మామ్ నువ్వు ఇండియన్‌వి, ఇండియన్స్ పేరు ఎంత సెటిమెంటల్ గా ఫీల్ అయినా జన్మ నక్షత్రం, చూసి పెడతారు. బుక్ రిఫర్ చేసి, తెలిసిన వాళ్ళని అభిప్రాయం అడిగి, వెతికి మరి నేమ్ పెడతారు.
అలా పెట్టిన నేమ్ కి ఒక డివైన్ వైబ్రేషన్ ఉంటుందట నేను ఒక వీడియోలో చూసాను.
నువ్వు కూడా నన్ను నా నేమ్‌తో పిలువు మా…! నాకు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవ్వాలని ఉంది. ఇప్పుడు నువ్వు పిలుస్తున్నా పిలుపులో మదర్ లవ్ ఉంటే, నా పేరుతో పిలిస్తే దానికి ఆ స్టార్స్ పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది కదా…! అప్పుడు డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. పేరు తో పిలువు అమ్మ…!” నవ్వుతూ అన్నాడు తులసి రామ్.
“తులసి…!” ప్రేమగా అంది హేమ.
“వావ్ ఇట్ సౌండ్స్ నైస్ మామ్, ఇక పై అదే కంటిన్యూ చేయు.” అని చెప్తూ హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు తులసి.
“నాన్న, నెక్స్ట్ వీక్ నువ్వు ఇండియా వెళ్ళాలి. గుర్తు ఉంది కదా..! అక్కడ జాగ్రత్త ఉంటావ్ గా…!” బెంగగా అంది హేమ.
“నువ్వే కదా మామ్ చెప్పింది ఇండియన్స్ ప్యూర్ వాటర్ లాంటి వాళ్ళు, ఏ బౌల్ లో పోస్తే ఆ బౌల్ లా షేప్ అవుతారని,
నా బ్లడ్ కూడా ఇండియనే కదా, నువ్వు నా గురించి అస్సలు వర్రీ అవ్వొద్దు.
బి ఏ రోమన్, ఈఫ్ యు ఆర్ ఇన్ రోమ్, అన్నట్టు ఇండియా లో గ్రాండ్‌పా హౌస్ లో నేను ఫుల్ ఇండియన్ లా ఉంటా, గ్రాండ్‌పా, నీకు నా గురించి ఒక్క కంప్లైంట్ కూడా చేయకుండా నేను మానేజ్ చేస్తా, ట్రస్ట్ మీ మామ్..!” అని నవ్వుతూ అన్నాడు తులసి రామ్.
మీ కళ్యాణ్ 🖋️🖋️🖋️
Swipe left/right or tap the sides to turn pages