నీకు 10 నిమిషాలు…. టైం ఇస్తున్న…. త్వరగా…. ఫ్రెష్ అయ్యి… జిమ్ లోకి రాకపోతే…. నీకు పనిష్మెంట్ ….మామూలుగా ఉండదు…. చెప్పి వెళ్ళిపోయాడు…!!
అసలే నైట్ తాగిన…. వోట్కా మత్తు దిగపోవడంతో…. వాళ్ళ అన్నయ్య ఇచ్చే పనిష్మెంట్ కి భయపడి…. దెబ్బకి మత్తు వదిలించుకోవడానికి…. వాష్రూమ్ కి వెళ్లి…. ఫ్రెష్……అయ్యి జిమ్ కి వెళ్ళిపోయాడు…..!!!
@@@@@@@@@@@@
లేటుగా పడుకున్న గీత తెల్లారి ఐదు గంటలకు లేగిసి … తన మీద ఒక కాలు చెయ్యి వేసుకుని బొటనవేలు నోట్లో పెట్టుకొని ముద్దుగా పడుకున్నా బాబుని చూసి నుద్దుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి వాడు పడకుండా పిల్లోస్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది…..!!!
ఫాస్ట్ గా ఫ్రెష్ అయి…. ఇంటి ముందు ఉన్న చిన్న ఖాళీ స్థలాన్ని….. తుడిచి నిల్లుజల్లి ముగ్గు వేసి కిచెన్ లో పనిచేయడానికి వెళ్ళిపోయింది…. ఆల్రెడీ నైట్ కిచెన్ క్లీన్ చేయడం ఉండడంతో బ్రేక్ ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది…!!!