సిద్దు ఫోటోనీ తడుముతూ…. చూస్తున్న
బన్నీ కి …..డోర్ సౌండ్…. వినిపించేసరికి సిద్దు ఏమంటాడో అన్నా భయంతో… తన చేతిలో ఉన్న ఫోటోని….. ఎక్కడా నుండి తీసాడో అక్కడ పెట్టేసి….. తన రెండు చెవుల్ని తన చిన్నా చేతులతో పట్టుకొని తలదించి బిక్క మొహం వేశాడు.😔
బన్ని నీ చూసినా సిద్దు కి ట్రాఫిక్ వల్ల వచ్చిన చిరాకు అంతా పోయింది…… సిద్దు ఏమన్నా అంటాడేమో అని భయంతో వణుకుపోతూ ఉన్నాడు బన్నీ….. బన్నీ అలా వనకడం చూసి ఫాస్ట్‌గా వెళ్లి వాడిని ఎత్తుకొని…. ఎందుకు నాన్న భయపడుతున్నావ్ నేనేమన్నా అంటాను అన్న…..నేను ఏమ్ అన్నాను నువ్వు రిలాక్స్ అవ్వు అంటు వీపు మీద నిమురుతున్నాడు….అయినా నువ్వు ఏంటి ఇక్కడున్నావ్……ఎలా వచ్చావ్…. ఎవరు తీసుకొచ్చారు….. అంటూ వరుసగా ప్రశ్నలు అడుగుతున్నాడు సిద్దు
సిద్దు ఎక్కడ కొడతాడని భయంతో వణుకుతూ ఎంతసేపటికి కొట్టపై సరికి కళ్ళు తెరిచి చూశాడు….. కానీ వరుసగా ప్రశ్నలు అడుగుతున్నా సిద్దు ని అయోమయం పేస్ తో చూస్తున్నాడు…..!!!;
అబ్బా నీకు మాటలు రావు కదా మర్చిపోయాను…..పద మనం బయటికి వెళ్దాం. అక్కడే బెడ్ ప్రక్కన టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని బన్ని ఎత్తుకొని కింద హాల్లోకి తీసుకొచ్చాడు…..