జత కలిసే ❤️
ఎపిసోడ్ 10 – విడిపోయిన బంధాలు
ఫ్లాష్‌బ్యాక్ – 18 సంవత్సరాల క్రితం
వర్మ కుటుంబం అంటే ఆ ఊరిలో ఎంతో గౌరవం ఉండేది. వివేక్ వర్మ, రాఘవేంద్ర వర్మ ఇద్దరూ బావబావమరుదులు మాత్రమే కాదు, ప్రాణ స్నేహితులు కూడా.
వివేక్ చెల్లెలు శ్రీదేవిని రాఘవేంద్ర పెళ్లి చేసుకోవడంతో రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. వివేక్ భార్య అనురాధ, శ్రీదేవి కూడా అక్కాచెల్లెళ్లలా ఉండేవారు.
పండుగలు, వేడుకలు అన్నీ కలిసి జరుపుకునేవారు. ఇద్దరూ కలిసి వ్యాపారం కూడా ప్రారంభించారు.