New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 13

జ్వాల W/O శక్తి – 13

ఆనంద్ భయంతో వెనక్కి తగ్గుతూ ఒక ఇనుప పైపును తీసుకుని విక్రమ్ పైకి దూకాడు. కానీ విక్రమ్ ఒకే ఒక్క పంచ్‌తో ఆనంద్ ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆనంద్ నోటి నుండి రక్తం వస్తూ కింద పడిపోయాడు. విక్రమ్ ఆనంద్‌ను కాలర్ పట్టుకుని లాక్కొచ్చి జ్వాల కాళ్ల ముందు పడేశాడు.

జ్వాల ఆనంద్ వైపు అసహ్యంగా చూసింది. “ఆనంద్.. నువ్వు లండన్ లో కూర్చుని చాలా పెద్ద ప్లాన్ వేసావు. ప్రసాద్‌ను, రుద్రప్పను ముందు పెట్టి నా భర్తను చంపావు. కానీ ద్రోహానికి ఎప్పుడూ ఒకే ముగింపు ఉంటుంది. ఇదిగో చూడు” అంటూ జ్వాల ఒక ట్యాబ్  ఆనంద్ ముఖం ముందు పెట్టింది.

ఆ ట్యాబ్ స్క్రీన్ పై లండన్ నుండి వచ్చిన ఒక లైవ్ న్యూస్ వస్తోంది.. ఆనంద్ లండన్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులన్నింటినీ బ్రిటీష్ ప్రభుత్వం సీజ్ చేసింది. విక్రమ్ పంపిన హవాలా, డ్రగ్ మాఫియా ఆధారాల వల్ల ఆనంద్ అంతర్జాతీయంగా జీరో అయిపోయాడు.

ఆనంద్ ముఖం తెల్లబడింది. “జ్వాలా.. నన్ను క్షమించు.. ఆస్తి మొత్తం నీకే వదిలేస్తాను. నన్ను లండన్ వెళ్లిపోనివ్వు” అని జ్వాల కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

 

జ్వాల వెనక్కి తప్పుకుంది. “నా భర్త శక్తి ని కారులో పెట్టి కాల్చినప్పుడు ఎంత నరకం అనుభవించి ఉంటాడు. అసలు ఎవరు తనని చంపాలని చూస్తున్నారో అని కూడా తనకు తెలిసి  ఉండదు.నువ్వు ఇలా తన చావు కోరుకుంటావు అని తన కలలో కూడా ఊహించి ఉండడు? తొడ పుట్టిన తమ్ముడిని ఇలా  డబ్బు కోసం చంపిన నీకు క్షమాపణ లేదు” అని  గట్టిగా గర్జించి అన్నది.

 

విక్రమ్ వేర్‌హౌస్ లో ఉన్న ఒక పెద్ద కెమికల్ డ్రమ్ ను తీసుకొచ్చి ఆనంద్ చుట్టూ పోసాడు. అది శక్తి కారు ప్రమాదంలో వాడిన అదే ‘మెగ్నీషియం, నైట్రో-సెల్యులోజ్’ కెమికల్ లిక్విడ్. దాన్ని చూడగానే ఆనంద్‌కు మరణం కళ్ల ముందు కనిపించింది.

 

జ్వాల తన చేతిలో ఉన్న ఒక లైటర్‌ను ఆన్ చేసింది. “ఆనంద్.. ప్రసాద్, రుద్రప్పల పాపం పండి. వాళ్ళ ఆయువు ముగిసింది. ఇప్పుడు ఈ కథకు అసలైన ముగింపు నీతోనే.  ఉంటుంది అని అంటూ లైటర్‌ను కింద పడేసింది.

క్షణాల్లో ఆ కెమికల్ లిక్విడ్ కు మంటలు అంటుకుని, ఆనంద్‌ను చుట్టు ముట్టాయి. వాడు మంటల్లో కాలిపోతూ భయంకరంగా కేకలు వేశాడు. ఆ భారీ వేర్‌హౌస్ మంటల్లో ఆనంద్ శరీరం కూడా గుర్తుపట్టలేనంతగా కాలి పోయి    కేవలం బూడిద మాత్రం కుప్ప గా మిగిలి   పోయింది. శక్తి మరణానికి కారణమైన ఆఖరి ద్రోహి కూడా సజీవ దహనమయ్యాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue