జ్వాల W/O శక్తి – 12
జేఎస్ కార్పొరేషన్ సామ్రాజ్యంపై జ్వాల తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుని, ప్రసాద్ మరియు రుద్రప్పలను సముద్ర తీరంలోని ఆ పాడుబడిన పెంకుటింట్లో సజీవ దహనం చేసిన తర్వాత అంతా ముగిసిపోయిందని భావించింది. ప్రతీకారం తీరిందని, శక్తి ఆత్మకు శాంతి చేకూరిందని ఆమె నమ్మింది. కానీ, వ్యాపార ప్రపంచంలోనూ, ఆ కుటుంబంలోనూ కుట్రలు అంత సులభంగా ముగిసిపోవు. జ్వాల, విక్రమ్‌లకు తెలియని అత్యంత భయంకరమైన నిజం ఏమిటంటే.. శక్తికి ఒకరు కాదు, ఇద్దరు అన్నలు ఉన్నారు. మొదటి అన్న ప్రసాద్ కేవలం ఒక పావు మాత్రమే. అసలైన ఆటగాడు, తెరవెనుక ఉండి మొత్తం చదరంగాన్ని నడిపించిన ద్రోహి, శక్తి రెండవ అన్న అయిన ఆనంద్.
ఆనంద్ పదేళ్ల క్రితమే లండన్ వెళ్లి స్థిరపడ్డాడని, అతనికి ఇక్కడి ఆస్తులతో ఎలాంటి సంబంధం లేదని అందరూ నమ్మారు. శక్తి కూడా తన రెండవ అన్నయ్య లండన్‌లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకున్నాడే తప్ప, వాడు తన ఎదుగుదలను చూసి లోపల ఎంతలా రగిలిపోతున్నాడో ఊహించలేకపోయాడు. ప్రసాద్‌ను జ్వాలాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది, రుద్రప్ప అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను ప్రసాద్‌కు పరిచయం చేసింది, చివరకు శక్తి కారులో ఆ అత్యాధునిక లిక్విడ్ టైమర్ బాంబును లండన్ నుండి స్మగ్లింగ్ ద్వారా తెప్పించింది అంతా ఈ ఆనందే. ప్రసాద్, రుద్రప్పలు దొరికిపోయినా తన పేరు ఎక్కడా బయటకు రాకుండా వాడు అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు.
ప్రసాద్, రుద్రప్పల మరణవార్త లండన్ చేరగానే ఆనంద్ లగేజీ సర్దుకుని రహస్యంగా ఇండియాలో అడుగుపెట్టాడు. నగరంలోని ఒక లగ్జరీ హోటల్ సూట్ రూమ్‌లో కూర్చుని, జ్వాల సక్సెస్ సాధించిన ‘జేఎస్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్’ ఫైళ్లను చూస్తూ వాడు క్రూరంగా నవ్వాడు.
ప్రసాద్ గాడు ఒక నెంబర్ వన్ మూర్ఖుడు. వాడికి డబ్బు మీద ఆశే తప్ప బుద్ధి లేదు. అందుకే ఆ జ్వాల చేతిలో, విక్రమ్ చేతిలో కుక్క చావు చచ్చాడు. కానీ ఆస్తి మొత్తం ఆ పిల్లలు లేనిదాని చేతిలోకి వెళ్లడాన్ని నేను అస్సలు సహించలేను. శక్తి ఎలాగూ బూడిదైపోయాడు. ఇప్పుడు ఈ జ్వాల వంతు” అని ఆనంద్ తన గ్లాసులోని వైన్ తాగుతూ స్వగతం పలికాడు.
ఆనంద్ ముఖంలో ప్రసాద్ లాంటి ఆవేశం లేదు, కేవలం మంచు లాంటి కఠినత్వం, పాము లాంటి విషపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. వాడు నేరుగా లీగల్ రూట్ ఎంచుకున్నాడు. లండన్ నుండి తెచ్చుకున్న కొన్ని నకిలీ పత్రాలు, పాత ఫ్యామిలీ బాండ్స్ ఆధారంగా జేఎస్ కార్పొరేషన్లో తనకు 40 శాతం షేర్లు ఉన్నాయంటూ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అంతేకాదు, ప్రసాద్ కుటుంబం మరణం వెనుక జ్వాల, విక్రమ్‌ల హస్తం ఉందంటూ ఇంటర్‌పోల్ మరియు స్థానిక పోలీసులకు అనామక లేఖలు పంపాడు.
ఇటు ఆఫీస్‌లో జ్వాల ఒక కొత్త ప్రాజెక్ట్ డీల్ పై సంతకం చేయబోతుండగా, లాయర్ రాఘవ్ గారు చాలా కంగారుగా లోపలికి వచ్చారు. “మేడమ్.. చాలా పెద్ద సమస్య వచ్చింది. శక్తి గారి రెండవ అన్నయ్య ఆనంద్ కోర్టు నుండి మన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌పై స్టే ఆర్డర్ తీసుకువచ్చారు. కంపెనీ అకౌంట్లను కూడా తాత్కాలికంగా ఫ్రీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది” అని చెప్పాడు.
ఆ మాట వినగానే జ్వాల షాక్‌కు గురైంది. శక్తి ఎప్పుడో చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చింది.. “మా రెండో అన్నయ్య ఆనంద్ చాలా తెలివైనవాడు జ్వాలా, కానీ వాడు ఎవరినీ నమ్మడు”. ఆనంద్ లండన్ లో ఉన్నాడని కదా అనుకున్నాం, ఇప్పుడు సడన్‌గా ఎలా వచ్చాడు అని జ్వాల ఆలోచనలో పడింది.
వెంటనే విక్రమ్ రంగంలోకి దిగాడు. “మేడమ్.. ప్రసాద్, రుద్రప్పలను మనం అంతం చేసినప్పుడు వాళ్ల ఫోన్ డేటాను నేను రికవర్ చేశాను. అందులో ఒక విదేశీ నంబర్ నుండి ప్రసాద్‌కు నిరంతరం కాల్స్ వచ్చాయి. ఆ నంబర్ లొకేషన్ లండన్ అని చూపించింది. అంటే, ప్రసాద్ కేవలం ఒక ముసుగు మాత్రమే. సార్ కారులో బాంబు పెట్టే ప్లాన్ ఇచ్చింది, ఆ కెమికల్స్ సప్లై చేసింది ఈ ఆనందే. వాడు ప్రసాద్‌ను, రుద్రప్పను ముందు పెట్టి నడిపించాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ చనిపోయేసరికి తనే నేరుగా మైదానంలోకి దిగాడు” అని విక్రమ్ అసలు నిజాన్ని విరమరిచాడు.
Swipe left/right or tap the sides to turn pages