అలా వాహిని వంట కూడా చేసింది
తరువాత పైన పొడుకోవడానికి ఏం లేవు అని కింద పాత మంచాలు రెండు ఉంటే రెండు గదుల్లో వేసి వాటి మీద పరుపు వేసి బెడ్ షీట్లు కూడా వేస్తుంది
నారాయణ గారు రాజేష్ కి కాల్ చేసి బాబు మీరు 11 తరువాత రండి
ఎందుకు బాబాయ్
ఏం లేదు బాబు మా కూతురు 11 తరువాత మంచిది అని మిమల్ని అప్పుడు రమ్మని చెప్పమని చెప్పింది మీకు అలాంటి నమ్మకం లేకపోతే ఎప్పుడు అయిన రావొచ్చు
సరే సార్ నేను మా సార్ నీ అడిగి చెప్తా బాబాయి అని ఫోన్ మ్యూట్ పెట్టీ అర్జున్ దగ్గర కి వెళ్తాడు సార్ వాహిని మేడమ్ మనల్ని 11 దాటిన తరువాత రమ్మని చెప్పారు అంట మరి మీరు ఏం అంటారు