ఈ రూమ్ అన్నయ్య దే…. పక్క రూమ్ కి అటాచడ్ గా ఉంటుంది…. అంటే…. అన్నయ్య కి టూ రూమ్స్ ఉన్నాయ్…. ఒకటి ఆఫీస్ రూమ్ అయితే ఇంకోటి… ఈ రూమ్…. అందుకే గ్రాని నిన్ను ఇందులో ఉండమని చెప్పింది….
సీత అయోమయంగా చూస్తుంటే… నాకు అర్ధం అయింది…. అన్నయ్య ఎక్కడ ఉంటాడు అనేగా నీ డౌట్….. అన్నయ్య ఈ రూమ్ లో ఎక్కువగా ఉండదు…. పక్క రూమ్ ఆఫీస్ రూమ్ అయినా కూడా….అందులో same ఈ రూమ్ ల గా నే బెడ్ అంత ఉంటాయి…. కానీ వాష్ రూమ్ ఉండదు…. సో…. ఈ రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ ఐ… మళ్ళీ ఆ రూమ్ కి వెళ్ళిపోతాడు అని శృతి చెప్పుకుతూ పోతుంది.
సరే రా వదిన అని సీత ని బెడ్ మీద కూర్చోబెట్టి…. ఇప్పుడు చెప్పు వదిన… నీ పేరు ఏంటి నువ్వు ఎం చదువుకున్నావు అని క్యూస్షన్స్ మీద క్యూస్షన్స్ వేస్తుంటే….. హలో హలో మేడమ్ అని నడుము మీద చేతులు పెట్టుకొని కోపంగా చూస్తుంది రాధికా.
సీత అయోమయంగా చూస్తుంటే…. శృతి… సీరియస్ గా పేస్ పెట్టి…. ఏంటి నన్ను మాట్లాడినివ్వకుండా చేస్తున్నావు… ఏంటి మ్యాటర్… ఎందుకు పిలిచావు అని రాధికా మీద గాయ్ మని లేస్తుంది శృతి.