కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే…. అలానే వెనక్కు వాలి….. అలానే చూతు ఉంది.
ఆలా చూస్తూ చూస్తూ… ఉండగా… డోర్ ఓపెన్ చేసుకొని సుప్రజ గారు రాగానే….. లేచి నిలబడింది చిన్న చిరు నవ్వుతో.
గుడ్ మార్నింగ్ తల్లి అని విష్ చేసింది సుప్రజ గారు.
అను చిరు నవ్వుతో… గుడ్ మార్నింగ్ అత్తయ్య అన్నది.
ఏంటి తల్లి అప్పుడే లేచావు…. ఇంకాసేపు పడుకోవచ్చు కదా తల్లి అనగానే…. లేదు అత్తయ్య… నాకు మార్నింగ్ లెవ్వడమే అలవాటు…. నిద్ర పట్టదు కూడా అని అనగానే…. సరే…. నాతో రా అని సీత చేతిని పట్టుకొని రూమ్ లో కి తీసుకు వచ్చింది సుప్రజ.