ప్రేమించాను నిన్నే 💞 5
నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్‌కి ఇద్దరికీ మెలకువ వస్తుంది…. మీనాక్షికి మాత్రం బాడీ అసలు సహకరించట్లేదు. తను లేవడానికి ప్రయత్నించినా లేవలేకపోవడం గమనించిన లక్ష్ వెంటనే తన దగ్గరికి వస్తాడు.
“నువ్వేం లేవకు మీనా… నెమ్మదిగా ఉండు…” అని చెప్పి తనకి ఫ్రెష్ అవ్వడానికి సహాయం చేస్తాడు. తర్వాత ఒంటికి టవల్ చుట్టి తీసుకువచ్చి బెడ్‌పై కూర్చోబెడతాడు.
ఆమెకి మ్యాక్సీ వేసి… బెడ్ మొత్తం క్లీన్ చేసి… మళ్లీ తనని బెడ్‌పై పడుకోబెడతాడు.
“నువ్వు రెస్ట్ తీసుకో… నేను ఫ్రెష్ అయి వస్తాను. ఏదైనా తిని టాబ్లెట్ వేసుకుందువు…” అని ప్రేమగా చెబుతాడు.
లక్ష్ ఫ్రెష్ అయి వచ్చేసరికి మీనాక్షి అప్పటికే నిద్రపోతూ ఉంటుంది. తనని లేపడం ఇష్టం లేక… కిచెన్‌లోకి వెళ్లి తనే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తాడు.
అది ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుని… వాటర్ బాటిల్ తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వస్తాడు. ప్లేట్‌ని టేబుల్‌పై పెట్టి… మీనాక్షిని మెల్లగా లేపుతాడు.
“మీనా… లే… ముందు ఏదైనా తిను. తర్వాత టాబ్లెట్ వేసుకుని పడుకుందువు…” అని అంటాడు.
మీనాక్షికి కూడా అప్పటికే ఆకలిగా అనిపించడంతో… లక్ష్ తినిపిస్తే మౌనంగా తింటూ ఉంటుంది.
“నువ్వు కూడా తింటున్నావా?” అని అడుగుతుంది.
“నేను తర్వాత తింటాను… ముందు నువ్వు తిను…” అని లక్ష్ చెబుతాడు.
తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి… పది నిమిషాల తర్వాత టాబ్లెట్ ఇచ్చి వేయిస్తాడు.
“ఇప్పుడు సైలెంట్‌గా పడుకో… నీకు బాగా రెస్ట్ కావాలి…” అని చెప్పి ఆమె పక్కనే పడుకుంటాడు.
అలా ఇద్దరూ కాసేపటికి నిద్రలోకి జారిపోతారు.
ఈవినింగ్ ఐదున్నర గంటలకి ఇద్దరికీ మెలకువ వస్తుంది. నిద్ర లేచిన తర్వాత అలా హాల్లోకి వచ్చి కూర్చుని టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.
మీనాక్షి కొంచెం షైగా ఫీల్ అవుతున్నా… “ఇంక తప్పదు కదా… రోజూ ఇలాగే ఉండాలి…” అని తనలో తానే అనుకుని నార్మల్‌గా మాట్లాడటం మొదలుపెడుతుంది.
లక్ష్ ఒడిలో కూర్చున్న మీనాక్షి… అతనితో కబుర్లు చెబుతూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది.
మధ్య మధ్యలో లక్ష్ తన చిలిపి పనులతో ఆమెని ఆటపట్టిస్తూ ఉంటాడు. మీనాక్షి కూడా అతన్ని చూసి నవ్వుతూ… “మీకు ఇదే పని…” అంటూ మురిసిపోతుంది.
అలా ఇద్దరూ తీసుకున్న లీవ్స్‌కి న్యాయం చేస్తూ… ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలా రోజులు గడుస్తూ ఉంటాయి….
ఒక సంవత్సరం గడిచిపోయినా… మీనాక్షి మీద లక్ష్‌కి ఉన్న ప్రేమలో మాత్రం కొంచెం కూడా మార్పు రాదు. ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
ఒక సండే ఉదయం… మీనాక్షి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటుంది. లక్ష్ నిద్ర లేచి రెండు గంటలు అయినా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని గమనించి… వెనక నుంచి వచ్చి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు.
“ఏంటి మేడం… నిద్ర లేచి రెండు గంటలు అవుతుంది… ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు?” అని అడుగుతాడు.
“ఏం లేదు శ్రీవారు… కొంచెం నీరసంగా ఉంది. నిన్న నైట్ నిద్ర ఎక్కడ పోనిచ్చారు మీరు…” అంటూ మీనాక్షి నవ్వుతూ అంటుంది.
“సారీ బంగారం…” అని లక్ష్ నవ్వుతాడు.
“సారీ చెప్పడం కాదు… కొంచెం హెల్ప్ చేయండి…” అని అంటుంది.
“సరే మేడం… చెప్పండి ఏం చేయాలి?” అంటాడు లక్ష్.
అలా ఇద్దరూ కలిసి కిచెన్‌లో దోశలు వేయడం మొదలుపెడతారు.
మీనాక్షి చక్కగా దోశ వేస్తుంటే… లక్ష్ కూడా తన వంతుగా ఒక దోశ తిప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సరిగ్గా తిరగక కింద పడిపోతుంది.
అది చూసిన మీనాక్షి ఒక్కసారిగా నవ్వడం మొదలుపెడుతుంది.
“అయ్యో… ఇదేనా మీ దోశ టాలెంట్?” అని ఆటపట్టిస్తుంది.
“ఏం లేదు… మొదటిది కదా… ఇంకోసారి పర్ఫెక్ట్‌గా వేస్తా…” అని లక్ష్ అంటాడు.
అలా ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేస్తారు.
ఆరోజు ఈవినింగ్ మీనాక్షి చాలా నీరసంగా ఉండడంతో… లక్ష్ ఆమెని హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడు.
డాక్టర్ అన్ని చెకప్‌లు చేసి… అవసరమైన టెస్టులు చేయిస్తుంది. కొంతసేపటి తర్వాత రిపోర్ట్స్ అన్నీ చూసి… ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తుంది.
“కంగ్రాట్యులేషన్స్… మీరు పేరెంట్స్ కాబోతున్నారు…” అని చెబుతుంది.
ఆ మాట విన్న క్షణం ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. తర్వాత ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కన్నీళ్లతో నవ్వుకుంటారు.
మీనాక్షి వెంటనే లక్ష్‌ని గట్టిగా హగ్ చేసుకుని… “నువ్వు డాడీ వి కాబోతున్నావు…” అని ఆనందంగా చెబుతుంది.
లక్ష్ కూడా ఆమెని దగ్గరగా హత్తుకుని… “ఇదే నా లైఫ్‌లో మోస్ట్ మెమొరబుల్ గిఫ్ట్ మీనా…” అని అంటాడు.
ఆ సంతోషం ఇంకా తగ్గకముందే… ఆఫీస్‌లో లక్ష్‌కి ప్రమోషన్ ఛాన్స్ వస్తుంది.
కానీ ఆ ప్రమోషన్‌తో పాటు ముంబై బ్రాంచ్‌కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది.
“మీనా… ప్రమోషన్ వస్తే మనం సెటిల్ అయినట్టే… కానీ మనం సిటీ చేంజ్ అవ్వాల్సి వస్తుంది…” అని లక్ష్ చెబుతాడు.
మీనాక్షి కాసేపు ఆలోచించి… “లక్ష్… మన బిడ్డ హైదరాబాద్‌లోనే పుట్టాలి. ఇప్పుడు ఈ టైమ్‌లో మనం సిటీ చేంజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు…” అని చెబుతుంది.
మీనాక్షి మాటలు విన్న లక్ష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా… “అయితే ప్రమోషన్ వద్దు మీనా… నువ్వు, మన బిడ్డ నాకు ముఖ్యం…” అని చెబుతాడు.
అలా తన ప్రమోషన్‌ని వదిలేసి హైదరాబాద్‌లోనే ఉండిపోతాడు.
ఆ మాట విన్న మీనాక్షి కన్నీళ్లతో లక్ష్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది.
“నువ్వే నా ప్రపంచం… నువ్వంటే నాకు ఎంతో ప్రేమ… నువ్వు లేకుండా నేను ఉండలేను…” అని కన్నీళ్లతో చెబుతుంది.
“నువ్వు సంతోషంగా ఉంటే చాలు మీనా… నాకు ఇంకేం కావాలి…” అని లక్ష్ ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.
అలా రోజులు గడుస్తూ ఉంటాయి. లక్ష్ మీనాక్షిని ఎంతో జాగ్రత్తగా, కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటాడు.
ఆఫీస్‌లో కూడా ఆమెకు ఏ పని ఎక్కువగా ఇవ్వకుండా… కొలీగ్స్ కూడా ఆమెకి చాలా సపోర్ట్‌గా ఉంటారు.
అలా నెలలు గడుస్తూ ఉంటాయి.
ఒకరోజు మళ్లీ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్తారు.
డాక్టర్ రిపోర్ట్స్ చూసి… ఈసారి ఇంకా పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తుంది.
“కంగ్రాట్యులేషన్స్… మీకు ట్విన్స్…” అని చెబుతుంది.
ఆ మాట విన్న ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
మీనాక్షి వెంటనే లక్ష్ వైపు చూస్తుంది… లక్ష్ కూడా ఆమె కళ్లలోకి చూస్తూ నవ్వుతాడు.
“అంటే ఇప్పటినుండి మనకి అన్ని డబుల్ హ్యాపీనెస్ అన్నమాట…” అని లక్ష్ నవ్వుతూ అంటాడు.
మీనాక్షి కూడా కన్నీళ్లతో నవ్వుతూ… “అవును…” అని చెబుతుంది.
అలా వాళ్ల జీవితంలోకి ఒకేసారి రెండు చిన్న ఆనందాలు రాబోతున్నాయనే వార్తతో… ఇద్దరి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.
ప్రేమతో మొదలైన వాళ్ల ప్రయాణం… ఇప్పుడు ఒక అందమైన కుటుంబంగా మారబోతున్న కొత్త దశలోకి అడుగుపెడుతుంది.
ఈ స్టోరీ ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు… స్టోరీని స్టోరీగా మాత్రమే చూడండి. ఇది నిజ జీవితానికి సంబంధించినది కాదు….
స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్… 🥰🥰
మీ చిన్ని ♥️
Swipe left/right or tap the sides to turn pages