అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. లక్ష్ మీనాక్షిని ఎంతో జాగ్రత్తగా, కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటాడు. ఆఫీసులో కూడా ఆమెకు ఎక్కువ పని లేకుండా చూసుకుంటాడు. కొలీగ్స్ కూడా మీనాక్షికి చాలా సపోర్ట్‌గా ఉండి… ఆమెని చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంటారు.
అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత మళ్లీ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్తారు.
డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూసి… ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తుంది.
“కంగ్రాట్యులేషన్స్… మీకు ట్విన్స్…” అని చెబుతుంది.
ఆ మాట విన్న వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ… ఆనందంతో నవ్వుకుంటారు.
“ఇప్పటినుండి మనకి అన్ని డబుల్ హ్యాపీనెస్ అన్నమాట…” అని లక్ష్ అంటాడు.