ఇంటి బయట నలుపు డ్రస్సుల్లో ఇద్దరు వ్యక్తులు మీనాక్షి, పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
మీనాక్షి వాళ్లని చూసి భయపడినా, ఈసారి మాత్రం ధైర్యం తెచ్చుకుంటుంది.
“ఏదైతే అది అయింది… నేను భయపడుతూ కూర్చుంటే నా పిల్లల్ని ఎవరు కాపాడతారు?” అని అనుకుని వెంటనే పోలీస్ స్టేషన్‌కి కాల్ చేస్తుంది.
పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెబుతుంది.
ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకుని రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని వాళ్ల పక్కనే పడుకుంటుంది.
పిల్లలిద్దరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు. కానీ మీనాక్షికి మాత్రం కళ్లకు నిద్ర పట్టదు.