లక్ష్ నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుని…
“నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్లను మీనా… నువ్వు ఏం చెబితే నాకు అదే ఓకే. నువ్వు సంతోషంగా ఉంటే చాలు…” అని అంటాడు.
ఆ మాటలు విన్న మీనాక్షి చిన్నగా నవ్వుతుంది.
ఆమె చిరునవ్వే తన సమాధానం అన్నట్టుగా…
“మన కిడ్స్ ఫ్యూచర్ కోసం అమెరికా వెళ్దాం శ్రీవారు… కానీ మనం ఎక్కడ ఉన్నా ఇండియాని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన మూలాల్ని, మన వాళ్లని, మన జ్ఞాపకాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు…” అని చెబుతుంది.
“అలాగే మీనా…” అని లక్ష్ నవ్వుతాడు.