పరవశం – 21
విక్రమ్ తనని పిలిచాడు అని చెప్పగానే మేఘ షాక్ అవుతుంది..
కంగారుగా ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసి, “సారీ, నన్ను అయ్యి ఉండదు.. మీరు పొరపాటు పడుతున్నారు అనుకుంటా,” అని అనగానే..
“లేదు మేడమ్.. మీ పేరు మేఘన సురేష్ కదా?” అని అంటాడు ఆ వ్యక్తి..
“అవును..” అని అంటుంది మేఘ..
“మరి మిమ్మల్నే పిలుస్తున్నారు మేడమ్.. ప్లీజ్ పదండి మేడమ్,” అని అనగానే..