New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పార్వతి పరిణయం – 2

పార్వతి పరిణయం – 2

👉గతం :-

సంపద పాపని ఒంటరిగా వదిలి పట్నం వెళ్ళింది…… 

 

పట్నంలో ఆమెతో ఇది వరకు (7ఎళ్ల  క్రితం) పెళ్లి ఫంక్షన్లో డాన్స్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు….. 

 

బంగారం షాప్ ఓనర్ దగ్గర టేబుల్క పై కడియం విసిరేసింది……

 

👉ప్రస్తుతం :-

సంపద కడియం పొగరుగా విసిరేసిన, తన కోపాన్ని తనలోనే అనుచుకొని ఆ కడియం తీసుకొని బంగారమో? కాదో? వెయిట్ ఎంతుందో చూస్తుండగా అతనికి ఒక అనుమానం వస్తుంది…

 

దానిపై ఉన్న రాజముద్ర ఎక్కడో చూసినట్టనిపించడంతో సంపదను,

 

అరెరే అలా నిలబడిపోయారేం!వచ్చి కూర్చోండి అని చెప్తాడు.

 

 

హా…. ఈమాట చెప్పడానికి ఇంత సెప్పట్టింది పాపం  హ్మ్ ….. అని దీర్ఘలుతీస్తూ వెళ్లి కూర్చుంది.

 

ఆమె పక్కకు వెళ్ళగానే షాపుఓనర్ ఏదో కింద పడ్డటుగా వంగి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నాన్న గారు మీరు ఈమధ్య మన దగ్గర నగలు చేయించుకొనే వారి రాజముద్రను చూయించారు కదా! 

 

అది తీసుకొని ఒక నాట్యగత్తే మన షాప్ కి వచ్చింది. నాకెందుకో ఈమె వాళ్ళ ఆస్తికోసం వాళ్ళని చంపి పిల్లని ఎక్కడో అమ్మేసినట్లుగా అనిపిస్తుంది. 

 

ఎందుకైనా మంచింది నేనీవిడిని మాటల్లో పడుతాను, మీరు పోలీసులని తీసుకొని వచ్చెయ్యండి అని పైకీలేచి చూసేసరికి సంపద అక్కడ ఉండదు….

 

ఈవిడెక్కడికి మాయమైపోయింది….. ఇక్కడే ఉండాలికదా ఏమైపోయినట్టు అని వెతుకుండగా కడియం తీసుకొని పారిపోతున్న సంపద కనిపిస్తుంది……

 

షాపుఓనర్ చూసి పరిగెడుతూ…….

 

ఏయ్య్, ఎవేరైనా ఆమను పట్టుకోండి  అంటూ అరుస్తాడు..

 

ఈలోగా ఆమె రన్నింగ్ బస్లోకి ఎక్కుతుంది.

 

ఛా……… తప్పించుకుంది, ఈసారి దొరకాలి… అంటు పళ్ళు కోరికడు షాపుఓనర్.

 

 

 

 ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒక ఆవిడ ఈ పాప చాలా బాగుంది నాకిస్తారా అని అడిగేలోపే ఎ ఎవరు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అడగగా 

 

ఆమె సమాధానం ఇస్తూ నాకు పేరు రాధా మీ ఇంట్లో పాప ఏడుపు విన్పించి వచ్చాను నేను వచ్చేటప్పుడు తాళం వేసి లేదు అనిచెప్తుడగానే ఆ సరే… అంటూ కంగారుగా పంపించేస్తుంది.

 

 హమ్మయ్య! ఎలాగోలా తప్పించుకున్న హ్హా అబ్బా….

అనుకుంటున్న కుర్చీలో వాళబోయిన సంపదకు పాప ఏడుపు చిరాకు తెప్పిస్తుంది.

 

కోపంగా పాప దగ్గరికి వెళ్లిన సంపద, 

నిన్నెముహూర్తన తీస్కోచ్చానోగాని అనవసరంగా పోలీసుల దగ్గర ఇరుక్కునే దాన్ని ఛీ….

 

 

అమ్మ తల్లి నువ్వు వద్దు, నీ కడియము వద్దు.

 

ఎక్కడో పడి చచ్చిపో ని నిర్ధాక్ష్యానంగా చెత్తకుప్పలో పడేస్తుంది. 

 

తెల్లవారి లేచి చూస్తే ఆ పాప మళ్ళీ తన ఇంటి గుమ్మం లోనే ఒక భవాని మాల ధరించిన స్త్రీ చేతిలో ఉంది.

 

సంపద:-

 

ఏయ్!ఎవరమ్మా నువ్వు నా గుమ్మంలో ఏమి చేస్తున్నావ్? ఈ పాపేవారు? అని అనగానే,

 

భవాని :-

 

వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవతని అలా చెత్తకుప్పలో ఎందుకు పడేసావు తల్లీ…….అనగానే 

 

నేను …. నేను… నేను పడెయడమెంటి? ఏం  మాట్లాడుతున్నావ్ హా? 

పి ..పిచ్చిపిచ్చిగా  ఉందా? నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు అని చెప్తుంది.

 

ఎందుకమ్మ అలా భయపడతావ్…. నేనెవరికీ చెప్పన్లే… అనగానే 

 

 

మళ్ళీ సంపద తడబడుతూ…. నువ్వేం చెప్తున్నవో నాకు అర్ధం కావట్లేదు ముందిక్కడనుంచి పో అని చెప్తుంది.

 

కానీ భవాని వెళ్లకుండా ఒక్కసారి ఆలోచించు…..

 

ఈ ఊరిలో ఇంతమంది ఉండగా ఈ పిల్ల నీకే ఎందుకు దొరికింది? 

 

పట్నంలో షాపుఓనర్ నిన్ను పోలీసులకు పట్టిస్తాన్నన్న నువ్వెందుకు పాపని వేరే ఆవిడ అడిగినప్పుడు ఇచ్చేయలేదు?

 

చెత్తకుప్పలో  పడిసిన పిల్లని అమ్మ మళ్ళీ నీ దగ్గరికే ఎందుకు పంపింది? అని అడుగుతుండగానే  సంపద కి తన స్నేహితురాలు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది.

 

అదే విద్యాదీవనా!చదువుకునే పిల్లలకు ప్రభుత్వం 15 వేలు ఉచితంగా ఇస్తుంది.

 

ఈ పిల్లని పెన్చుకుంటే  డబ్బు, పనిమనిషి, నాలుగురిలో అనాధని పెంచుతున్న పేరు  నాకొక తోడు అన్ని ఒకేసారి కలిసోస్తాయి….. 

 

అని సంబరపడిపోతు చాలా ధన్యవాదములు ఈ బిడ్డని మళ్ళీ తెచ్చి ఇచ్చినందుకు అని పాపని తీస్కొని ఇంట్లోకి వెళ్తూతుంది.

 

పార్వతి దేవి గుడి ఎదురుగా దొరికినందున, 

 

సంపద ఆ పాపకు “పార్వతి “అని పేరు పెడుతుంది.

 

 

 

 

 

 

 

 

                                        ‘ 17 సంవత్సరాల తర్వాత ‘

 

 

 

 

 

 ఆ రోజు పార్వతి ఇంటర్ రిజల్ట్స్,

 

పార్వతి ఉదయాన్నే లేచి, 

 

అమ్మ,……..అమ్మ….. లేమ్మా… అమ్మ అంటూ సంపదను నిద్రలేపి పద గుడికి వెళదాం అంటుంది.

 

నిద్రావస్థలో ఉన్న సంపద పొద్దుపొద్దున్నే ఏంటే నీ గోల… ఇప్పుడు గుడికెందుకు అంటుంది?

 

 అదేంటమ్మా…. ఇవాళ నా రిజల్ట్స్ కదా మంచి మర్క్స్ రావాలని కోరుకుందాం. ఆ కోరుకుంనంతమాత్రకి నీ మార్కులు మారతాయా? పెరుగుతాయా? 

 

ఐన నువ్ బానే రాసుంటావులే వెళ్ళు  నన్ను విసిగించకు….అంటుంది.

 

ఇదిగో నువ్ రాకపోయావో…చెప్తున్నా…

 

ఆ రాకపోతే.. ఏం చేస్తావే నువ్వు…హా ఏం చేస్తావ్..అనగానే పిల్లిలా ముడుచుకుపోయిన పార్వతి ఏం చేస్తాను………… గౌరీ తీసుకొని వెళ్తాను అని చిన్నగా నసుగుతుంది.

 

 

గౌరీ చిన్నప్పటి నుండి పార్వతికి మంచి ఫ్రెండ్… వీరిందరు సొంత అక్కాచెల్లెలకంటే ప్రేమగా ఉండేవారు.

 

గౌరీ పార్వతి ఇద్దరు గుడికి వెళ్లిన కాసేపటికే గౌరీ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెడ మడా తిట్టేస్తున్నారు.

 

అమ్మ ఆగే ఎందుకు తిడుతున్నావో చెప్పి తిట్టు ప్లీజ్.అంటే అన్ని సబ్జక్ట్స్లో ఇంత మంచి స్కోర్ చేసి, ఫిజిక్స్లో మాత్రం ఫెయిల్ అయ్యావేంటే అని అడగడంతో…..

 

లేదమ్మా అలా జరిగే ఛాన్సె లేదే నేను ఆప్షన్స్తో సహా అన్ని రాసాను అని చెప్తున్నా వినకుండా నువ్వు ముందు ఇంటికి రా.. అంటుంది.

 

కొబ్బరికాయలు తేవడానికి వెళ్లిన పార్వతికి మెసేజ్ చేసి వెళ్ళిపోతుంది..

 

 

 

 (ఇంతకీ చదువుల్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చే ఫ్రెండ్స్ ఇద్దరిలో గౌరీ ఎందుకు ఫెయిల్ అయింది? పార్వతి పాస్ అయ్యిందా లేదా? ఇలాంటి మరిన్ని విషయాలు నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం.)

 

 

🥰:మీకో సీక్రెట్ చెప్పనా నెక్స్ట్ పార్టీ హీరో ఎంట్రీ కూడా ఇచ్చేస్తా👍ఎందుకంటే 3 నా లక్కీ నెంబర్. 😄👋