New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పార్వతి పరిణయం – 3

పార్వతి పరిణయం – 3

విధి రాసిన తొలి పరిచయం

 

తెల్లవారుజామున…

 

గ్రామంలోని పార్వతి దేవి ఆలయంలో గంటలు మోగుతున్నాయి. అప్పుడే నిద్రలేచిన పార్వతి స్నానం ముగించుకుని దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది.

 

 

 

పార్వతి: అమ్మా పార్వతీ దేవి… ఈరోజు మా ఇంటర్ రిజల్ట్ వస్తుంది కదా! నాకు మంచి మార్కులు రావాలి. అలాగే నా స్నేహితురాలు గౌరికి కూడా మంచి మార్కులు రావాలి. మేమిద్దరం కలిసి స్టేట్ ఫస్ట్ రావాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాం. మా కల నిజం చేయమ్మా!

 

అని దేవుడికి దండం పెట్టుకుని తల్లి దగ్గరకు వెళ్తుంది.

 

పార్వతి: అమ్మా… గుడికి వెళ్దామా?

 

సంపద: నాకు కుదరదు. నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లు.

 

పార్వతి: సరే అమ్మా. మరి గౌరిని తీసుకెళ్తాను.

 

అని చెప్పి గౌరి ఇంటికి బయలుదేరుతుంది.

 

మరోవైపు…

 

గౌరి ఇంట్లో తన తల్లి చేతిలో ఫోన్ పట్టుకుని కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

 

గౌరి వాళ్ల అమ్మ: గౌరీ! ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నానో చూడు. ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తవేంటి? నీ రిజల్ట్ వచ్చేసింది. వెబ్‌సైట్‌లో చూశాను. నువ్వు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావట!

 

గౌరి: ఏంటి అమ్మా! అది ఎలా సాధ్యం? నేను అన్ని ప్రశ్నలకీ సరిగ్గానే రాశాను కదా!

 

గౌరి వాళ్ల అమ్మ: నువ్వు రాసినంత మాత్రాన సరిపోదు. మార్కులు కూడా రావాలి కదా! ముందు ఇంటికి రా.

 

గౌరి బాధగా ఫోన్ పెట్టేస్తుంది.

 

ఇంతలో పార్వతి నుంచి మెసేజ్ వస్తుంది.

 

గుడికి వెళ్దామా? నేను కొబ్బరికాయలు తీసుకుని గుడి దగ్గర ఉన్నాను.

 

గౌరి ఆ మెసేజ్ చూసి కాసేపు ఆలోచించి…

 

నువ్వు గుడికి వెళ్ళు పార్వతి. నేను  అమ్మతో బయటకి వచ్చాను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి పార్వతి ని తీసుకొని గుడికి వెళదాం అని ప్లాన్ చూసుకున్న గౌరీ తిరిగి ఇంటికి వెళ్తుంది.

 

నాకు కొంచం పని ఉంది అని రిప్లై ఇచ్చి ఇంటికి బయలుదేరుతుంది.

 

పార్వతి: (ఫోన్ చూస్తూ) ఏమైందో ఏమో! సరే, గుడికి వెళ్లొచ్చాక మాట్లాడతాను.

 

అని గుడిలోకి వెళ్తుంది.

 

మరోవైపు… హైదరాబాద్

 

ఒక పెద్ద బంగ్లా…

 

ఖరీదైన కారు ముందు ఒక యువకుడు నిలబడి తన ఫోన్ చూస్తుంటాడు.

 

అతని పేరు కేదార్ వర్మ .(అతనే మన హీరో )

 

డబ్బున్న కుటుంబంలో పుట్టిన అబ్బాయి. తను అనుకున్నది జరగాల్సిందే. తన మాటకు ఎదురు చెప్పడం అతనికి అస్సలు నచ్చదు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చని నమ్మే మనస్తత్వం. అయితే తన వాళ్ల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటాడు.

 

కేదార్ : హలో! నేను చెప్పిన పని ఇంకా ఎందుకు అవ్వలేదు?

 

ఫోన్‌లో వ్యక్తి: సార్… ఆ పని చేయడానికి కొంచెం సమయం పడుతుంది.

 

కేదార్ : నాకు ఆలస్యం అంటే ఇష్టం ఉండదు. నేను ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్నానంటే అది జరిగిపోవాల్సిందే. అర్థమైందా?

 

అని ఫోన్ పెట్టేస్తాడు.

 

అప్పుడే అతని స్నేహితుడు రాజీవ్ అక్కడికి వస్తాడు.

 

రాజీవ్ : ఏంట్రా కేదార్ ! పొద్దున్నే ఎవరిమీద అంత కోపం?

 

కేదార్ : కోపం కాదు రా… నాకు కావాల్సింది నా దగ్గరికి రావాలి. దాని కోసం ఎంతవరకైనా వెళ్తాను.

 

రాజీవ్ : నీకు అసలు ఎదురే లేదురా!

 

కేదార్ : ఉండకూడదు కూడా!

 

అని నవ్వుతూ కారులో కూర్చుంటాడు.

 

తిరిగి గ్రామంలో…

 

గుడిలో పార్వతి పూజ ముగించుకుని బయటకు వస్తుంది.

 

అప్పుడే అక్కడ కొంతమంది విద్యార్థులు తమ ఫోన్లలో రిజల్ట్ చూస్తూ ఆనందంగా కేకలు వేస్తుంటారు.

 

రాము : అరే! రిజల్ట్ వచ్చేసింది రా!

 

సుమన్ : త్వరగా వెబ్‌సైట్ ఓపెన్ చెయ్!

 

పార్వతి కూడా కంగారుగా తన ఫోన్ తీసి రిజల్ట్ చెక్ చేస్తుంది.

 

కాసేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోతుంది.

 

తర్వాత ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

 

పార్వతి: అమ్మా పార్వతీ దేవి! థాంక్యూ తల్లీ!

 

ఆమెకు ఇంటర్‌లో అద్భుతమైన మార్కులు వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.

 

ఆనందంతో వెంటనే గౌరికి ఫోన్ చేస్తుంది.

 

పార్వతి: హలో గౌరీ! మన రిజల్ట్ వచ్చేసింది!

 

గౌరి: తెలుసు ..

 

పార్వతి: నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది గౌరీ! మనం అనుకున్న కల నిజమైంది!

 

గౌరి: (బాధగా) కంగ్రాట్స్ …

 

పార్వతి: అదేంటి ? నీ రిజల్ట్ చూసుకోలేదా?

 

గౌరి: చూశా… ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను.

 

పార్వతి: ఏంటి? నువ్వా? అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు కూడా నాలాగే అన్ని ప్రశ్నలకీ సమాధానాలు రాశావు కదా!

 

గౌరి: అవును . అదే నాకూ అర్థం కావడం లేదు.

 

పార్వతి: బాధపడకు గౌరీ. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మనం రీ -వెరిఫికేషన్ పెడదాం.

 

గౌరి: వద్దు పార్వతి. ఇప్పుడు ఇంట్లో అమ్మ కూడా చాలా బాధపడుతోంది.

 

పార్వతి: నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఏమీ కాదు.

 

అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

 

కొన్ని గంటల తర్వాత…

 

గౌరి ఇంట్లో…

 

గౌరి తన మార్కుల మెమోను పట్టుకుని కూర్చుని ఉంటుంది.

 

ఇంతలో పార్వతి అక్కడికి వస్తుంది.

 

పార్వతి: గౌరీ!

 

గౌరి: (కన్నీళ్లు తుడుచుకుంటూ) రా పార్వతి.

 

పార్వతి: ఏంటి గౌరీ! నువ్వు బాధపడితే ఎలా? మనిద్దరం ఎంత కష్టపడి చదువుకున్నామో నాకు తెలుసు. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినంత మాత్రాన నీ ప్రతిభ తగ్గిపోదు.

 

గౌరి: కానీ నేను రాసిన పరీక్షలో అన్ని ప్రశ్నలకీ సమాధానాలు రాశాను. నాకు వచ్చిన మార్కులు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్టుంది.

 

పార్వతి: అయితే మనం ఆ తప్పు ఏంటో తెలుసుకుందాం.

 

అని గౌరిని ఓదారుస్తుంది.

 

మరుసటి రోజు…

 

కాలేజీలో…

 

పార్వతి, గౌరి ఇద్దరూ తమ మార్కుల వివరాలు తెలుసుకోవడానికి కాలేజీకి వెళ్తారు.

 

అక్కడ లెక్చరర్ గౌరి మార్కుల మెమో చూసి ఆశ్చర్యపోతాడు.

 

లెక్చరర్: గౌరీ… నీ పేపర్‌లో ఏదో కరెక్షన్జ మిస్టేక్రి జరిగినట్టుంది. నువ్వు రాసిన సమాధానాలకు వచ్చిన మార్కులు సరిగ్గా లేవు. రీ-వాల్యుయేషన్‌కు అప్లై చెయ్.

 

గౌరి: అంటే నేను పాస్ అవుతానా సార్?

 

లెక్చరర్: నీ పేపర్ మరోసారి పరిశీలిస్తేనే తెలుస్తుంది. కానీ నీకు అన్యాయం జరిగి ఉండే అవకాశం ఉంది.

 

అది విన్న పార్వతి సంతోషిస్తుంది.

 

పార్వతి: చూశావా గౌరీ! నేను ముందే చెప్పాను కదా. నీకు అన్యాయం జరిగిందని!

 

గౌరి ముఖంలో కూడా చిన్న చిరునవ్వు వస్తుంది.

 

ఇదిలా ఉండగా…

కేదార్ రాజీవ్ఒ తో కలిసి ఒక పని మీద గ్రామానికి వస్తాడు.

 

వాళ్ల కారు గ్రామంలోని ప్రధాన రహదారిపై వెళ్తుంటుంది.

 

అదే సమయంలో పార్వతి, గౌరి ఇద్దరూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డుపక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు.

 

గౌరి: పార్వతి… రీ-వాల్యుయేషన్‌లో నాకు మంచి మార్కులు వస్తే మనిద్దరం మళ్లీ కలిసి చదువుకోవచ్చు కదా!

 

పార్వతి: తప్పకుండా వస్తాయి. నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టకపోయినా నా దృష్టిలో ఎప్పటికీ ఫస్ట్ ర్యాంకరే!

 

అంటూ నవ్వుతుంది.

 

అప్పుడే ఆదిత్య కారు వేగంగా వాళ్ల పక్క నుంచి వెళ్తుంది.

 

రోడ్డుపై ఉన్న నీళ్లు పార్వతి మీద పడతాయి.

 

పార్వతి: ఏయ్! కారు ఆపండి!

 

కేదార్ కార్ ఆపుతాడు.

 

దిగి పార్వతి దగ్గరకు వస్తాడు.

 

కేదార్ : ఏంటి? రోడ్డుమీద నిలబడి అరవడం తప్ప ఇంకేం పని లేదా?

 

పార్వతి: రోడ్డు నీ అబ్బ సొత్తా? కాస్త చూసుకుని కారు నడపడం రాదా?

 

కేదార్ : హలో! నీళ్లు పడితే కడుక్కో. అంతేకానీ రోడ్డుమీద నన్ను ఆపి క్లాస్ పీకకు.

 

పార్వతి: తప్పు చేసి ఎదురు మాట్లాడుతున్నావా? కనీసం సారీ చెప్పడం కూడా తెలియదా?

 

కేదార్ : సారీనా? నీకా?

 

పార్వతి: అవును! నాకే!

 

కేదార్ : హ్మ్… నీకు సారీ చెప్పడానికి నేను ఎవరనుకుంటున్నావు?

 

పార్వతి: మనిషివైతే చాలు. సారీ చెప్పడానికి ఇంకేం అర్హత కావాలి?

 

ఆ మాటకు కేదార్ ఆమె వైపు కోపంగా చూస్తాడు.

 

అతని స్నేహితుడు రాజీవ్ మధ్యలో కలుగజేసుకుంటాడు.

 

రాజీవ్ : పదరా కేదార్ . చిన్న విషయానికి ఎందుకు గొడవ?

 

కేదార్ : నేను చిన్న విషయానికి గొడవ పడటం లేదు రా. వీళ్లకి ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాను.

 

పార్వతి: ముందు నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. తర్వాత మాకు నేర్పించు!

 

గౌరి పార్వతి చేతిని పట్టుకుంటుంది.

 

గౌరి: పార్వతి! వదిలేయ్. మనం వెళ్దాం.

 

పార్వతి: ఇలాంటి వాళ్ల వల్లే రోడ్డు మీద ప్రశాంతంగా నడవలేకపోతున్నాం.

 

అని కేదార్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

 

ఆదిత్య మాత్రం ఆమె వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడు.

 

రాజీవ్ : ఏంట్రా? ఆ అమ్మాయి మాటలకు నీకు కోపం వచ్చిందా?

కేదార్ : కోపం కాదు రా. నాతో అలా మాట్లాడిన మొదటి అమ్మాయి తనే .

 

రాజీవ్ : మరి?

 

కేదార్ : ఆ అమ్మాయికి పొగరు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఆ పొగరు తగ్గించాలి.

 

అని కారు ఎక్కుతాడు.

 

కానీ అతనికి తెలియదు… తను ఇప్పుడే గొడవపడిన అమ్మాయే తన జీవితంలోకి రాబోయే వ్యక్తి అని!

 

అదే సమయంలో… సంపద ఇంట్లో

 

సంపద ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది.

 

అందులో నుంచి ఒక వ్యక్తి దిగి సంపదను పలకరిస్తాడు.

 

వ్యక్తి: అమ్మా సంపద గారు! రాజుగారి దగ్గర నుంచి వచ్చాను.

 

సంపద ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.

 

సంపద: రాజుగారా? ఏ రాజుగారు?

 

వ్యక్తి: పదిహేడేళ్ల క్రితం మీరు తీసుకెళ్లిన ఆ బంగారు కడియం గురించి మాట్లాడాలి.

 

ఆ మాట వినగానే సంపద ముఖం పాలిపోయినట్లవుతుంది.

 

సంపద: (మనసులో) ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ కడియం విషయం ఎందుకు వచ్చింది? అసలు వాళ్లకు పార్వతి గురించి ఏమైనా తెలిసిందా?

 

అని భయంతో లోపలికి చూస్తుంది.

 

అక్కడే పార్వతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది.

 

ఎపిసోడ్ ముగింపు…

 

 

—

 

తదుపరి ఎపిసోడ్‌లో:

 

గౌరీ రీ -వాల్యుయేషన్ సంగతి ఏమైంది? 

చనిపోయిన రాజుగారు పంపారని వచ్చిన అతను ఎవరు?

 కేదార్ పార్వతి మళ్ళీ ఎలా కలుస్తారు అనే విషయాలు నెక్స్ట్ పార్టులో చూద్దాం……

 

 

 

                   బాయ్ 👋👋👋👋👋👋👋🥰🥰