పెళ్లి చూపులు -82
అప్పుడు తను ఏం మాట్లాడాడు అనేది అర్థమై ఇబ్బందిగా తలదించుకొని తనని తాను తిట్టుకున్నాడు హబ్బా పక్కన సిరి ఉంది అన్న విషయం మర్చిపోయానే అని అనుకున్నాడు.
“అవునా, కరెక్టే నువ్వు ఆలోచించింది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని లోతు ఎంత అనేది కూడా తెలుసుకోవాలి” అని భార్గవ్ అన్నారు.
“మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు” అని కావాలని అడిగింది సిర..
“అదేంటి సిరి ఏమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నావ్ ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ వైష్ణవ్ వాళ్ళదే కదా, అదే విషయం మాట్లాడుతున్నాను, నిజానికి విజయేంద్ర ఆఫీసులో నిన్ను చూసి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు అయితే బాగుండు అని పెళ్లి సంబంధానికి ఇక్కడికి వచ్చారంట, ఆ తర్వాతే మేమిద్దరం ఒకప్పటి ఫ్రెండ్స్ అని మాకు అర్థమయింది” అని ఉన్న విషయం మొత్తం చెప్పేశారు.
“ఓ అవునా కానీ ఈ విషయం నాకు తెలియదు వైష్ణవ్ ఒక ఎంప్లాయ్ గా మాత్రమే ఉన్నాడు కదా మేము కూడా ఇప్పటివరకు ఎంప్లాయ్ అనుకున్నా ఓనర్ అనుకోలేదు” అని వైష్ణవ్ వైపు కోపంగా చూస్తూనే అన్నది సిరి.