పెళ్లిచూపులు-84
“అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటాను ఇలా నువ్వు ఎన్ని సంబంధాలు తీసుకొని వచ్చినా నేను పెళ్లి చేసుకోను” అని కరాకండిగా తేల్చి చెప్పేసాడు వైష్ణవ్.
ముందుకు అడుగు వేస్తున్న వరూధిని ఆగిపోయి నిదానంగా స్లో మోషన్ లో వెనక్కి తిరిగి “నిజం చెప్పరా పెళ్లిచూపులకి వెళ్తున్నాం అనేసరికి నువ్వు ఇలా అబద్దం చెప్తున్నావు కదా, ఇంతకుముందు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే మీ డాడీ బలవంతంగా నిన్ను పెళ్లి చూపులకు తీసుకొని వెళ్ళాడు అని ఇప్పుడు నువ్వు ఇలా అబద్ధం చెప్తున్నావు కదా, ఇదంతా పెళ్లిచూపులు క్యాన్సిల్ కావాలి అని చెప్తున్నా కదా” అని అడిగింది.
వీడు మనసులో మాట చెప్పడేమో అనుకున్నాను చివరికి చెప్పేసాడు. ఇప్పుడు నా పెళ్ళాం రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అని మనసులో అనుకుంటూ జరిగేది చూస్తూ ఉన్నారు విజయేంద్ర.
“అమ్మ నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను డాడీ పెళ్లిచూపులుకి తీసుకొని వెళ్ళినప్పుడు నిజంగానే నేను ఎవరిని ప్రేమించలేదు, అప్పుడు పెళ్లి చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మన ఆఫీసులోనే ఆ అమ్మాయి వర్క్ చేస్తుంది, నాలుగు రోజుల క్రితమే నా మనసులో మాట తనకి చెప్పాను తను ఓకే చెప్పింది” అని జస్ట్ సింపుల్ గా ఇద్దరూ ఒకరికి ఒకరు ఐలవ్యూ చెప్పుకున్నట్లు మాత్రమే చెప్పాడు.
“అవునా సరే అయితే ఇప్పుడు తనకి ఫోన్ చేయరా, నేను మాట్లాడతాను” అని వరూధిని చేతులు కట్టుకొని అన్నది.