ఉదయం ఎనిమిది గంటలు.
ఆదిత్య తన బ్లాక్ షర్ట్‌కి వాచ్ పెట్టుకుంటూ అద్దంలో చూసుకున్నాడు. అతని ముఖంలో ఎప్పటిలా ప్రశాంతత లేదు. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయాలనే పట్టుదల కనిపిస్తోంది.
మేఘన చేతిలో రెండు కాఫీ కప్పులతో గదిలోకి వచ్చింది.
“మిస్టర్ ఆదిత్య వర్మా… ఈరోజు మీ కంపెనీని తిరిగి గెలుచుకునే రోజు కదా?”
ఆదిత్య చిన్నగా నవ్వాడు.
“కంపెనీని గెలుచుకోవడం కాదు మేఘనా… నా పేరు మీద జరిగిన మోసానికి సమాధానం చెప్పించాలి.”
“అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో. అక్కడ ఎంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నువ్వు ఒంటరివి కాదు.”
ఆమె మాటలకు ఆదిత్య కాసేపు మౌనంగా చూశాడు.
“నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకేం కావాలి?”
“అది సరే… కానీ మీటింగ్‌కి ఆలస్యం చేస్తే మాత్రం నేనే నీకు వ్యతిరేకంగా మాట్లాడతా!”
ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు వెళ్లారు.