“మన కుటుంబంలో ఒకరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది!”
రమేష్ చెప్పిన మాటతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
“నాన్నా… అసలు ఏం జరిగింది? ఇన్నాళ్లూ నాకెందుకు చెప్పలేదు?”
రమేష్ చేతిలో ఉన్న ఫైల్‌ను టేబుల్ మీద పెట్టాడు.
“నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు జరిగిన గొడవ వెనుక అసలు కారణం నీకు తెలియదు ఆదిత్య.”
“అయితే చెప్పండి. ఈసారి ఏదీ దాచకండి.”
రమేష్ కుర్చీలో కూర్చున్నాడు.
“వి.ఎస్. హోల్డింగ్స్ అనే కంపెనీని నేను, శేఖర్ కలిసి ప్రారంభించాం. ఆ తర్వాత ఏ.వి. ఇన్నోవేషన్స్‌లో పెట్టుబడి పెట్టాం. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ కొంతకాలానికి కంపెనీ డబ్బులు లెక్కల్లో కనిపించకుండా పోవడం మొదలైంది.”
“అది విక్రమ్ చేశాడని మనకు తెలుసు కదా?”
“విక్రమ్ డబ్బులు తీసుకున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా?”
ఆదిత్య మౌనంగా చూశాడు.