New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 36

♥️బావ మరదలు♥️ – 36

కేరళలోని మున్నార్, అలప్పి హనీమూన్ ప్రయాణంలో మధురమైన జ్ఞాపకాలను మనసులో నింపుకుని శివ, సాహిత్యలు హైదరాబాద్‌లోని తమ ఫ్లాట్‌కు తిరిగి చేరుకున్నారు. రెండు రోజుల విశ్రాంతి తర్వాత, సోమవారం ఉదయం శివ మళ్లీ తన ఆఫీస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. బ్లేజర్ వేసుకుని, అద్దం ముందు నిలబడి టై సర్దుకుంటున్నాడు శివ. అతని ముఖంలో హనీమూన్ తాలూకు ప్రశాంతత, స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సాహిత్య వంటింట్లో నుంచి వేడి వేడి కాఫీ కప్పు పట్టుకుని వచ్చింది. పెళ్లయిన తర్వాత ఆమె అందం మరింత రెట్టింపయ్యింది. ఈరోజు పట్టు అంచు ఉన్న పసుపు రంగు కాటన్ చీర కట్టుకుని, నుదుటిన నిండుగా సిందూరం పెట్టుకుని పక్కా తెలుగు గృహిణిలా కనిపిస్తోంది

 

 

 

“ఇదిగో బావా! పొద్దున్నే నీ కోసం స్పెషల్ అల్లం కాఫీ. ఈరోజు ఆఫీస్‌కి కొత్త సీఈఓ వస్తున్నారని చెప్పావు కదా, చాలా యాక్టివ్‌గా ఉండాలి” అంటూ కప్పు అందించింది.

శివ కాఫీ అందుకుంటూ సాహిత్య బుగ్గ గిల్లాడు. “థాంక్స్ రౌడీ. అవును, యూఎస్ హెడ్‌క్వార్టర్స్ నుండి కొత్త సీఈఓ వస్తున్నారు. మా కంపెనీ పాత చైర్మన్ జైలుకు వెళ్లడంతో, ఆ ప్లేస్‌లోకి ఆమెని పంపించారు. కానీ నాకెందుకో చిన్న టెన్షన్‌గా ఉంది సాహిత్య” అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.

“ఎందుకు బావా? నీ తెలివితేటల ముందు ఏ సీఈఓ అయినా తలవంచాల్సిందే కదా! అయినా ఆ కొత్త సీఈఓ ఎవరో నీకు తెలుసా?” అంది సాహిత్య కుతూహలంగా.

శివ కాస్త తడబడుతూ, “ఆ… తెలుసు సాహిత్య. ఐదేళ్ల క్రితం నేను యూఎస్‌లో మాస్టర్స్ చేసి, అక్కడ వర్క్ చేసినప్పుడు నా టీమ్‌లోనే పనిచేసింది. పేరు ఏంజెలీనా. చాలా టాలెంటెడ్, కానీ కాస్త మొండిది” అన్నాడు. ఏంజెలీనాకు తనపై ఉన్న వన్-సైడ్ క్రష్ గురించి చెబితే సాహిత్య అప్పుడే రచ్చ చేస్తుందని శివ ఆ విషయాన్ని తెలివిగా దాచేశాడు.

 

ఓహో! అయితే నీ పాత కొలీగ్ అన్నమాట. సరే బావా, జాగ్రత్తగా వెళ్లి రా. నేను మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్‌కి వస్తాను” అంది సాహిత్య నవ్వుతూ.

“వద్దు రౌడీ! ఈరోజు కొత్త సీఈఓ జాయినింగ్ డే కదా, ఆఫీస్ అంతా చాలా హడావుడిగా ఉంటుంది. నేను క్యాంటీన్‌లో తింటానులే, నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో” అని శివ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆఫీస్‌కు బయలుదేరాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue