ఆఫీస్ క్యాబిన్‌లో ఏంజెలీనా విసిరిన ఛాలెంజ్ తర్వాత, సాహిత్య అక్కడి నుండి కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆమె మైండ్ మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ కంటే వేగంగా పరుగెత్తుతోంది. “ఆ అమెరికన్ దెయ్యం నా మొగుడిని నా నుండి దూరం చేస్తానని సవాల్ విసురుతుందా? నా బావకు నేను తప్ప ఇంకొకరి నీడ కూడా తగలనివ్వను” అనుకుంటూ సాహిత్య తన మొబైల్ ఫోన్ తీసుకుంది. శివ ఫోన్ లోకేషన్‌ను సాహిత్య ముందే తన ఫోన్‌కు లింక్ చేసుకుని ఉంచింది (విక్రమ్ సహాయంతో).
ఇటు ఆఫీస్‌లో ఏంజెలీనా తన మొదటి పావు కదిపింది. సాయంత్రం ఆరు గంటలవుతుండగా, ఏంజెలీనా శివ క్యాబిన్‌లోకి వచ్చింది. ఆమె ఈరోజు ఆఫీస్ సూట్ తీసేసి, ఒక చాలా మోడ్రన్ రెడ్ కలర్ పార్టీ డ్రెస్ వేసుకుని మెరిసిపోతోంది.
“శివా! వర్క్ చాలా ఎక్కువైంది కదా. ఈరోజు రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌లో ఒక ఇంపార్టెంట్ బిజినెస్ డిన్నర్ మీటింగ్ అరేంజ్ చేశాను. నువ్వు నాతో పాటు రావాలి. ఇది సీఈఓ ఆర్డర్” అంది ఏంజెలీనా చాలా స్టైల్‌గా, కళ్లు తిప్పుతూ.
శివ ఇబ్బందిగా కదిలాడు. “ఏంజెలీనా… ఈరోజు వద్దు. ఇంట్లో సాహిత్య నా కోసం ఎదురుచూస్తుంటుంది. పైగా మధ్యాహ్నం నువ్వు, తను గొడవ పడ్డారు కదా, ఇప్పుడు మళ్లీ నేను నీతో డిన్నర్‌కి వస్తే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది” అన్నాడు తల గోక్కుంటూ.
“ఓ కమాన్ శివా! నువ్వు ఒక పెద్ద కంపెనీ ప్రాజెక్ట్ హెడ్‌వి. భార్యకు భయపడి బిజినెస్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటావా? జస్ట్ టూ అవర్స్ అంతే. పద, నా కారులోనే వెళ్దాం” అంటూ ఏంజెలీనా శివ చేయి పట్టుకుని బలవంతంగా క్యాబిన్ నుండి బయటకు తీసుకెళ్లింది. శివ తప్పనిసరి పరిస్థితుల్లో, సాహిత్యకు ‘ఆఫీస్ మీటింగ్ ఉంది, కాస్త లేట్ అవుతుంది’ అని మెసేజ్ పెట్టి కారు ఎక్కాడు.
ఇంట్లో ఉన్న సాహిత్య ఆ మెసేజ్ చూడగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. వెంటనే తన ఫోన్ లోని జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేసింది. శివ లొకేషన్ తాజ్ బంజారా ఫైవ్ స్టార్ హోటల్ వైపు వెళ్తున్నట్లు స్పష్టంగా చూపించింది.
“ఓహో! బిజినెస్ మీటింగ్ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్‌కి వెళ్తున్నావా బావా? నాతో ఆట ఆడితే ఎలా ఉంటుందో ఈరోజు ఆ ఏంజెలీనాకు, నీకు ఇద్దరికీ చూపిస్తాను!” అంటూ సాహిత్య రెడీ అవ్వడం మొదలుపెట్టింది. అయితే ఈసారి ఆమె చీర లేదా జీన్స్ వేసుకోలేదు… ఒక అల్ట్రా-మోడ్రన్ బ్లాక్ గౌన్, కళ్లకు స్టైలిష్ గాగుల్స్, తలకు ఒక విగ్ (Wig) పెట్టుకుని ఎవరూ గుర్తుపట్టలేని ఒక రిచ్ ఫారెన్ రిటర్న్ అమ్మాయిలా మారిపోయింది.
రాత్రి ఎనిమిది గంటలు. తాజ్ బంజారా హోటల్‌లోని రూఫ్-టాప్ రెస్టారెంట్.