మాంగళ్య బంధం – 1
లక్ష్మీపురం..
అది ఒక అందమైన పల్లెటూరు…
ఆ ఊరిలో శేఖర్ గారిది అందమైన చిన్న కుటుంబం..
శేఖర్ గారి భార్య పేరు శాంతి…
వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా ఒక అమ్మాయి పుట్టింది…
ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..
ఒక్కగానోక్క కూతురు కావడం తో శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు…
ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు..
ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..
ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..
డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ఇష్టం లేని ప్రతిమ వాళ్ళ పక్కూరిలో వున్న స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతుంది..
ఆమెకి నెలకు పదిహేను వేల రూపాయలు జీతం ఇస్తున్నారు…
తను చదువు చెప్తున్న స్కూల్ లో టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది..
చదువు మీద ఇంటరెస్ట్ వున్న ప్రతిమ కి టీచింగ్ చేయడం కష్టం గా ఏమీ లేకపోవడం తో ఎంతో ఇష్టం గా రోజు స్కూల్ కి వెళ్తూ పిల్లలకి పాఠాలు చెప్పి ఉదయం, సాయంత్రం ఆటో లో వెళ్లి వస్తుంటుంది…
ప్రతిమ అంటే శేఖర్, శాంతి ఇద్దరికీ ప్రాణం అయిన సరే శేఖర్ గారు తన ప్రేమని ఎప్పుడు మాటల ద్వారా పైకి చెప్పేవారు కాదు..
శాంతి మాత్రం మాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమని వ్యక్త పరుస్తుండడం తో ప్రతిమ కి తల్లి తో ఉన్నంత చనువు, తండ్రి దగ్గర లేకుండా పోయింది…
చనువు మాత్రమే లేదు సుమీ… తల్లి తండ్రి ఇద్దరి మీద చెప్పలేని ప్రేమ, గౌరవం రెండు వున్నాయి ప్రతిమకి..
కాకుంటే శేఖర్ గారి మీద భయం తో కూడిన గౌరవం ఉంటుంది అంతే తేడా…
తనకి ఏమీ కావాలన్న, ఎం చెయ్యాలి అన్న డైరెక్ట్ గా తండ్రికి చెప్పకుండా ముందు తల్లికి చెప్పి ఆమె ద్వారా తండ్రికి తెలిసేలా చేసేది ప్రతిమ..
అలా రోజులు గడుస్తూ ఉండగానే ప్రతిమ వాళ్ళ పెద్దమ్మ కూతురుకి పెళ్ళి కుదురుతుంది…
ఆ పెళ్ళి కోసం తల్లి, తండ్రి తో కలిసి పెద్దమ్మ ఇంటికి వెళ్తుంది ప్రతిమ..
పెళ్ళి ఇల్లంతా చాలా సందడి గా వుంది.. ఆరోజే పెళ్ళి కావడం తో అందరూ పెళ్ళి పనుల్లో చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ వున్నారు…
ప్రతిమ వాళ్ళ పెద్దమ్మ వీళ్ళని చూసి హ్మ్ ఇప్పటికి తీరిక దొరికిందా మీకు రావడానికి.. నేనింకా ఒకేసారి పెళ్ళి అయ్యిపోయాక వస్తారు అనుకున్నాను అంటు చిన్నగా కోప్పడతారు..
అబ్బా అక్క నీకు తెలియనిది ఏముంది ఆయన కి తీరిక లేనన్ని పనులు అందుకే కాస్త ఆలస్యం అయింది… ఎప్పుడు వస్తే ఏముంది లే కాని పెళ్ళి పనులు అన్ని పూర్తయినట్టేనా అని సర్ది చెప్తూ అడిగారు శాంతి..
హ్మ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావ్ లే గాని లోపలకి వెళ్లి ముందు ఫ్రెష్ అయి రండి.. ఏదో ఒకటి తినేసి పనుల్లో సాయం చేస్తురు అంటూ వాళ్ళకోసం రూమ్ చూపించి అమ్మా ప్రతిమ నువ్వు తినేసాక అక్క దగ్గరకి వెళ్ళు…
తనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆవిడ ..
ఆవిడ చెప్పినట్టుగానే ఫ్రెష్ అయ్యాక ఆవిడ పంపిన భోజనాలు చేసేసి శేఖర్, శాంతి గారు పెళ్ళి పనుల్లో సాయం చేయడానికి వెళ్లగా ప్రతిమ పెళ్ళి కూతురు అదే తన అక్క దగ్గరకి వెళ్తుంది…
వెళ్లేదారిలో పెళ్ళికి చేసిన ఏర్పాట్లని చూసుకుంటూ వెళ్తుంది..
అబ్బా ఇంటిని ఎంత చక్కగా అలంకరించారు… ఎంతయినా సీటీ లో పెళ్లిళ్లు ఇలానే ఆర్బాటం గా ఉంటాయి లే…
ఇల్లే ఇలా ఉందంటే ఇంక కల్యాణ మండపం ఎలా ఉంటుందో, అక్కడ డెకరేషన్స్ ఎలా వుంటాయో అని మనసులో అనుకుంటూనే తన అక్క గదికి వెళ్లి ఆమెని పలకరించి తను రెడీ అయ్యేకి సాయం చేస్తుంటుంది..
ముహూర్తనికి ఇంకా రెండు గంటలే సమయం ఉందని పెళ్ళికి కావాల్సినవి అన్ని తీసుకుని బందువుల సమేతంగా, పెళ్లికూతురు తో కలిసి కార్లలో కల్యాణ మండపానికి బయలుదేరుతారు..
ప్రతిమ తన అక్క కి తోడుగా పెళ్లికూతురు కోసం రెడీ చేసిన కార్ లోనే కూర్చుంటుంది…
ఆ కార్ కి చేసిన డెకరేషన్ చూసి బాబోయ్ ఏమన్నా డెకరేట్ చేసారా సూపర్ గా వుంది..
మా పల్లెటూరులో పెళ్లిళ్ళకి ఇలా చేసేది ఏమీ ఉండదు.. ఎంతయినా సిటీ లైఫ్ వేరబ్బా అని మనసులో అనుకుంటూ ఉంటుంది..
ప్రతిమ ఆలోచనల్లో ఉండగానే కార్ కల్యాణ మండపం చేరుకుంటుంది…
ప్రతిమ, మరో ఇద్దరు ముందు దిగి ఆఖరిగా పెళ్ళి కూతుర్ని కిందకి దించుతారు..
కెమెరామేన్స్ రెడీ గా ఉండడం తో ఫొటోస్ క్లిక్ చేస్తూ వీడియో తీస్తు మండపం లోకి తీసుకెళ్తారు…
కార్ డెకరేషన్ కె ఏదేదో అనేసుకున్న ప్రతిమ కి కల్యాణ మండపం ఎంట్రెన్స్ లోనే పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు ఫొటోస్ వేసి పెళ్ళికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా వున్న ఫ్లెక్సీ,
మండపం డెకరేషన్, రక రకాల పువ్వులతో చేసిన అలంకరణ, వాటిలో కొన్ని పువ్వులు అసలు ప్రతిమ ఇప్పటికి చూసింది కూడా లేదు..
మండపం చుట్టు సెట్ చేసి వున్న లైటింగ్ అవన్నీ చూడగానే నోరు తెరిచేసింది…
వామ్మో ఇది పెళ్లేనా.. ఇదేంటి ఇంత అద్భుతం గా వుంది… మా ఊర్లో నేను ఎన్నో పెళ్లిళ్లు చూసాను కానీ.. ఇలాంటి డెకరేషన్ అసలు కలలో కూడా చూసింది లేదు..
ఇదే కాబోలు పల్లెటూరి పెళ్లిళ్ళకి, సీటీ పెళ్లిళ్ళకి వున్న తేడా… ఎంతయినా విల్లెజ్ విల్లెజ్ ఏ, సీటీ సీటీ యే..
సీటీ లైఫ్ టోటల్ డిఫరెంట్ అండ్ కంఫర్టబుల్ లైఫ్.. ఇంత గ్రాండ్ గా పెళ్ళి జరగాలి అంటే రాసి పెట్టుండాలి..
ఎంతయినా మా అక్క లక్కీ ఫెలో… పెళ్ళి ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు అంటే పెళ్ళికొడుకు వాళ్ళు మంచి రిచ్ పర్సన్స్ అయ్యుంటారు అని తను అనుకుంటూ ఉండగానే పక్కన పెళ్లికి వచ్చిన అమ్మలక్కల మాటలు ప్రతిమ చెవిన పడ్డాయి..
వదిన నీకు తెలుసా పెళ్లి కొడుకు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్లంట.. ఒక్కడే కొడుకు ముందు వెనక ఎవరు లేరు.. బోలెడన్ని ఆస్తులు కూడా వున్నాయి..
పైగా అబ్బాయి ఐటీ లో జాబ్ చేస్తున్నాడంట.. నెలకి లక్షలో జీతం… ఈ పెళ్లికూతురు నక్క తోక తొక్కినట్టే తన జీవితం ఈరోజుతో బ్రహ్మడం గా మారిపోతుంది లే అనుకుంటుంటారు..
ఆ మాటలు ప్రతిమ మెదడులో బలం గా ముద్రిమ్చుకున్నాయి.. నేను పెళ్లంటూ చేసుకుంటే సీటీ లో వుంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాడినే చేసుకోవాలి..
అప్పుడే నా లైఫ్ కూడా అక్క లైఫ్ లానే మారిపోతుంది.. ఎన్నాళ్ళని పల్లెటూరులో వుంటాను..
సీటీ లైఫ్ నీ నేను కూడా ఎంజాయ్ చేయ్యోద్ద అని మనసులో ఫిక్స్ అవుతుంది..
continued…
Swipe left/right or tap the sides to turn pages