మాంగళ్య బంధం – 2
సీటీ లైఫ్ నీ నేను కూడా ఎంజాయ్ చేయ్యోద్ద.. మంచిగా జాబ్ చేస్తూ సిటీ లో సెటిల్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఎంచక్కా కార్ లలో తిరుగుతూ హ్యాపీగా బతకొచ్చు అని మనసులో ఫిక్స్ అవుతుంది..
సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం, సిటీ లైఫ్ కోడం చాలానే ఆశలు పెట్టుకుంటుంది ప్రతిమ…
వాళ్ళ అక్క పెళ్ళి లో జరిగిన ఆర్బాటాల ప్రభావం ఆమె మీద గట్టిగానే పడింది…
ఆ ఆలోచనలతోనే మరో రెండు రోజులు పెద్దమ్మ ఇంట్లోనే ఉండిపోయారు ప్రతిమ, తన కుటుంబం..
పెళ్ళి, తర్వాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అన్ని పూర్తయ్యాక వాళ్ళ అక్క నీ అత్తగారింటికి కూడా సాగనంపి తరువాత రోజు సీటీ నుండి తమ ఊరికి వెళ్ళిపోతారు…
సీటీ నుండి ఊరికి వచ్చేసిన సరే ప్రతిమ మనసంతా సిటీ నే నిండిపోయింది… అక్కడ వాతావరణం, అక్కడ వుండే స్పెషలిటీస్ అవన్నీ ఆమెకి తెగ నచ్చేయడం తో ఆమె కి కాబోయే అతను కూడా వాళ్ళ బావ లాంటి వాడే కావాలి అని బలం గా కోరుకుంటుంది..
ఆ ఆలోచనలతోనే రోజు స్కూల్ కి వెళ్లి వస్తు ఉంటుంది ప్రతిమ…
అదే ఊరిలో మరొక కుటుంబం కూడా నివసించేవారు …
తల్లి యశోద.. తండ్రి శ్రీరాములు.. వాళ్ళ కొడుకు ప్రణయ్… కూతురు భాను..
ప్రణయ్ కి తల్లిదండ్రులు అంటే పంచప్రాణాలు.. అక్క అంటే చాలా ప్రేమ..
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం.. నలుగురు ఎంతో సంతోషం గా జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో గాని పని మీద టౌన్ కి వెళ్లిన శ్రీరాములు గారికి ఆక్సిడెంట్ అవడం తో స్పాట్ లోనే చనిపోతారు…
అప్పటివరకు ఎంతో సంతోషం గా జీవిస్తున్న ఆ కుటుంబం శ్రీరాములు గారి చావు తో చిన్నభిన్నాం అయిపొయింది..
శ్రీరాములు గారిది వ్యవసాయ కుటుంబం.. ఆయన వ్యవసాయం చేస్తూ ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటా ఉండేవారు…
అలాంటిది ప్రణయ్ పదవ తరగతిలో ఉండగానే జరిగిన ప్రమాదం లో ఆయన కన్ను మూయడం తో ఆ కుటుంబ పరిస్థితి పాడయింది…
ఆ ఇంట్లో సంపాదించేది ఒక్క శ్రీరాములు గారె.. ఇప్పుడు ఆయనే లేక వ్యవసాయం చేయక వచ్చే ఆదాయం ఏమీ లేకపోవడం తో పేదరికం లోకి వచ్చేసారు…
భర్త చనిపోయి ఒకవైపు, పిల్లలకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నానే, వాళ్ళ భవిష్యత్ ఏంటన్న దిగులు మరోవైపు యశోద గారికి కన్నీళ్లు మిగిల్చాయి…
తండ్రి వున్నప్పుడు తల్లి కంట్లో ఎప్పుడు కన్నీళ్లు చూడని ప్రణయ్, భాను కి ఇప్పుడు యశోద గారు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోతారు…
అందుకే ప్రణయ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు..
ప్రస్తుతం తండ్రి లేడు.. తమకి ఆదాయం లేదు.. తల్లి ఎం చేసి వాళ్ళని పోషించగలదు.. అందుకే తన పదవితరగతి పూర్తి చేసాక చదువు మానెయ్యాలని అతనే ఏదో ఒకటి చేసి తమ కుటుంబాన్ని పోషించాలని ఫిక్స్ అవుతాడు..
తను అనుకున్నట్టుగానే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేస్తాడు.. ప్రణయ్ కి చదువంటే చాలా ఇష్టం.. కానీ కుటుంబ పరిస్థితుల కారణం గా తనకి ఎంతో ఇష్టమైన చదువు నీ కూడా వదులుకోడానికి సిద్ద పడతాడు…
టెన్త్ క్లాస్ లో ప్రణయ్ స్కూల్ టాపర్.. కానీ ప్రణయ్ కాలేజ్ కి వెళ్ళాలి అన్న ఆశ ను వదులుకుని తమ కుటుంబ పోషణ నిమిత్తం తన తండ్రి ఎంతో ఇష్టం గా చేస్తున్న వ్యవసాయ వృత్తి నీ ఎంచుకుని ఆ నేల తల్లి నీ నమ్ముకునీ పదహారెళ్ల వయసులోనే నాగలి పట్టుకుని చేలోకి వెళ్ళాడు..
ప్రణయ్ తీసుకున్న నిర్ణయం యశోద గారికి నచ్చలేదు.. ప్రణయ్ కి చదువంటే ఎంత ఇష్టమో ఆమెకి బాగా తెలుసు..
కానీ ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి పోయి తన ఒక్కగానోక్క కొడుకు పుస్తకాలు వదిలేసి పలుగు, పార పట్టుకోవడం ఆమె మనసుని బాధించేది…
ఆమె బాధ అర్ధం చేసుకున్న ప్రణయ్ నే తల్లిని ఓదార్చేవాడు.. అమ్మా నాన్న ఎప్పుడు అంటు ఉండేవాడు కదా.. నా తరువాత ఈ ఇంటి బాధ్యతలు నీవే ప్రణయ్…
అమ్మ నీ అక్కని జాగ్రత్త గా చూసుకోవాలి అని నాకు చెప్తూ ఉండేవాడు కదా..
నాన్న ఇప్పుడు మన దగ్గర లేకపోవచ్చు కానీ నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి..
నాన్న కి నేను ఇచ్చిన మాట నీ నిలబెట్టుకునే సమయం వచ్చింది .. నేను నా మాట నిలబెట్టుకుంటాను.. నాన్న ఎక్కడ వున్న నన్ను చూసి గర్వపడతాడు కదా అమ్మ…
నువ్వు దేనికి బాధ పడకు… చదువు లేకపోయినా పర్వాలేదు.. నాకు నువ్వు,అక్క క్షేమం గా,సంతోషం గా ఉంటే అంతే చాలు…
మన కుటుంబం రోడ్డు న పడకుండా మన కాళ్ళ మీద,మన సంపాదన మీద మనం బతుకుదాం అని చిన్నవాడయినా వయసుకి మించిన పెద్దరికంగా ఆలోచించి ఆ వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు ప్రణయ్..
continued…
Swipe left/right or tap the sides to turn pages