ప్రణయ్ ఇటువైపు తిరిగి పడుకున్న వెంటనే ప్రతిమ కూడా ఇటువైపు తిరగడంతో ఆమె ఎక్కడ మేలుకొని ఉందో అని కాస్త కంగారు పడతాడు అతను ..
కానీ ప్రతిమ కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది.. అది గమనించిన ప్రణయ్ హమ్మయ్య తను నిద్ర పోతుందా..
ఎక్కడ మేల్కొని ఉందో నేను ఎక్కడ తననే చూస్తున్నాను అపార్థం చేసుకుంటుందో అనుకున్నాను ఒక నిమిషం పాటు..
ఏంటో ఈ ప్రతిమ తన చిన్న పిల్లల ఆలోచనలు.. ఒకరి మీద ఒకరికి ఇష్టం ప్రేమా లేనప్పుడు ఒకే మంచం మీద పడుకోగానే ఏమైనా జరిగిపోతుందా ఏంటి..
ఏదేదో పిచ్చిపిచ్చిగా ఆలోచించి తనకు అసలే మాత్రం అలవాటు లేని పనులు చేయాలి అనుకుంటుంది పిచ్చి మా తల్లి..
శేఖర్ మావయ్య శాంతి అత్తయ్య తనని ఎంత అపురూపంగా ,, గారాభం గా పెంచుకొని ఉంటారు.. అసలే ఒక్కగానొక్క కూతురు..