తన చేతులతో వాటిని పట్టుకోవాలి అంటే ఏదో తెలియని బిడియం కాసేపు ఆపడంతో వాటిని చూస్తూ అక్కడే నిల్చుని పోతాడు..
ప్రణయ్ బట్టలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్లి చాలాసేపు అవుతున్న అతను రాకపోవడంతో అతను అసలు ఆ గదిలో ఉన్నాడా లేదా కూడా అర్థం కాని ప్రతిమ ప్రణయ్ గారు ఉన్నారా అని చిన్నగా పిలుస్తుంది..
ఆమె పిలుపుకి తేరుకున్న ప్రణయ్ హా ప్రతిమ ఉన్నాను వస్తున్నాను అని ఆమెకు వినిపించేలా చెప్పి తన వణుకుతున్న చేతులతోనే చేతికి అందిన వాటిని తీసుకుని గబగబా డోర్ దగ్గరికి వెళ్తాడు..
డోర్ వెనక నిలబడి ప్రతిమ గారు తెచ్చాను కాస్త డోర్ ఓపెన్ చేస్తారా అని చిన్నగా అడిగాడు..
ప్రణయ్ అవతల వైపు ఉన్నాడు తన బట్టల్ని అతను ముట్టుకున్నాడు అన్న ఊహకే ఏదోలా ఉన్న ప్రతిమ కి ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి ఆ బట్టలు ఎలా తీసుకోవాలో కూడా బిడియంగానే ఉన్న ఇక తప్పక చిన్నగా డోర్ కాస్త ఓపెన్ చేసి కేవలం ఆమె చేతిని మాత్రమే బయటకు పెడుతుంది..
నగ్నంగా బయటకు వచ్చిన చేతిని ఆ చేతి మీద ముత్యపు బిందువుళ్ళ ఉన్న నీటి చెమ్మని చూసిన ప్రణయ్ కి ఒళ్లంతా జల్లుమంటుంది..