తన ఇన్నేళ్ల జీవితం లో ఏ మగాడు కూడా తనని ఇలా అక్క, చెల్లి అన్న వరస తో పిలిచిందే లేదు… అప్పుడప్పుడే మీసాలు, గడ్డాలు వస్తున్న వాడి దగ్గర నుండి రేపో మాపో కాటికి పోయే పండు ముసలాల్ల వరకు తనని, తన శరీర అవయవాలని కామం గా చూసిన వారే.
డార్లింగ్, బంగారం, బేబీ, బుజ్జి అంటు పిలిచిన వారే తప్ప ఇలా అటు ఇటు కళ్ళు తిప్పకుండ తనకి తానుగా తన అందాలని చూపిస్తున్న ఏ మాత్రం చూడకుండా, అసలు చలించకుండా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాత్రమే చూసి మాట్లాడుతూ అక్క అని పిలిచి తన అక్కల తనని భావిస్తునదుకు ఆ అమ్మాయి కి మనసంతా ఏదోలా అయిపొయింది..
తను ఇప్పుడు ఎలాంటి వృత్తి అయిన చేస్తూ ఉండని కాక తను కూడా ఒక ఆడదే కదా… తనకి కూడా బంధాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటు ఉంటాయి కదా..
తను అతన్ని కోరిగ్గా చూసి సుఖ పడాలి అనుకుంటే అతను తనని అక్క ల చూసి అలాంటి తప్పు చేయకు అని చెప్తున్నాడు..
అతను అక్క అన్న పిలుపు కే ఆమె చెంప మీద గట్టిగ ఎవరో లాగి పెట్టి కొట్టినట్టుగా అనిపించింది ఆమెకి.. ఇప్పటి వరకు నేను తమ్ముడి లాంటి వాడి గురించా ఇంత దారుణంగా అనుకుంది..
చి చి ఎంత పాపత్మురాలిని నేను.. ఎదుటి వారి మనసులో తమ మీద ఏ భావం ఉందొ తెలుసుకోకుండా ఇలా మోహించడం ఎంతటి పాపం అని మొదటిసారి తను చేస్తున్న పనికి సిగ్గుతో చచ్చిపోతుంది ఆ అమ్మాయి..