దానికి కారణం అయిన మీకెలా థాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు అర్ధం కావడం లేదు అంటు ప్రణయ్ గురించి ఎంతో గొప్పగా చెప్తుంది..
ఆమె మాటలు విన్న ప్రతిమకి పచ్చి వెలక్కాయ నోట్లో పెట్టుకున్నంత వికారం గా మొహం పెట్టి ఎందుకు మీరు మరీ అతని గురించి ఇంతలా చెప్తున్నారు..అతనిలో అంత స్పెషాలిటీ మీకు ఏం కనిపించింది అని తన అసహనాన్ని దాస్తూ అడిగింది…
దాంతో ఆ అమ్మాయి ప్రణయ్ కి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం వివరంగా చెప్పి ఇంతకంటే ఇంకేం స్పెషాలిటీ కావాలి మేడం..
కోరికతో మీద పడుతున్న ఆడదానిలో కూడా అక్క నీ, అమ్మ నీ చూస్తు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ అక్క అని పిలిచి నేనే సిగ్గు పడేలా చేసి, నాకు నేనుగా తన నుండి దూరం గా వచ్చేసేలా చేసాడు..
అంతకంటే గొప్ప వ్యక్తిత్వం వున్న మనుషులే లేరు.. అలాంటిది వయసులో వున్న అబ్బాయిలు ఉండడం చాలా అరుదు..
నువ్వు మాత్రం అతన్ని అస్సలు వదులుకోకండి.. మా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి మేడం నేను ఇంక వుంటాను..