New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 64

మాంగళ్య బంధం – 64

భాను కూడా షాపింగ్ కి రావాల్సింది.. బట్ ఆమెకి పీరియడ్ టైమ్ అని , తను షాపింగ్ మరొక రోజు చేసుకుంటానని రాకుండా ఆగిపోతుంది..

 

ప్రతిమ మనసంతా బాధగా వుంది.. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది పెళ్ళి ఆపాలని.. కానీ ఒక్కటి సఫలం అవ్వడం లేదు..

 

పెళ్ళి పనులు జోరందుకున్నాయి.. పెళ్ళి రోజు దగ్గరకి వస్తుంది.. ఆమెకి చాలా కంగారు ప్లస్ విసుగ్గా వుంది.. కానీ తన చేతుల్లో ఏమి లేదు..

 

ఒక కారణం అయిన సరైనది దొరికితే పెళ్ళి ఆపాలని చూస్తుంటే ప్రణయ్ సైడ్ నుండి ఎలాంటి రిమార్క్ కనిపించడం లేదు..

 

అందుకే  లోపల ఏడుస్తూ, పైకి నవ్వుతూ షాపింగ్ కి వెళ్ళింది.. యశోద, శాంతి, ప్రతిమ లు ఒక సైడ్ కి వెళ్లి  చీరలు చూస్తుంటే శేఖర్ గారు మాత్రం ఈ ఆడ వాళ్ళ షాపింగ్ అప్పుడే పూర్తవదు కాబట్టి నేను నాకోసం ఏమైనా తీసుకుని ఒక చోట కూర్చోవడం మంచిది అనుకుంటా ఆయన కోసం బట్టలు తీసుకునే పనిలో  పడ్డారు..

 

 

యశోద, శాంతి ఇద్దరు కలిసి ప్రత్తిన వంటి మీద ఒక్కో చీర వేసి చూస్తూ అదో బాగుందా, ఇది బాగుందా అంటు ఆమెని అడుగుతూ వుంటారు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue