బట్టలు /, నగలు పని కంప్లిట్ అయిపోవడం తో అందరు కలిసి భోజనాలు పూర్తి చేసేసి, పెళ్ళి పత్రికలు రేపటి నుండి పంచడం మొదలు పెట్టాలి అని ఎవరెవరిని పిలవాలి, ఏఏ ఊర్లకి వెళ్ళాలి అని అన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు..
అది కూడా పూర్తయ్యాక పెళ్ళి పత్రికలకి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి సిద్ధం చేస్తారు..
ముందుగా ఒక కార్డ్ ని ఇంట్లో దేవుని దగ్గర ఉంచేసి, తరువాత కార్డ్ ని ఆ ఊరి గుడిలో దేవుని పాదాల దగ్గర పెట్టేసి ఆ దేవుని ఆశీర్వాదాలు తీసుకున్న తరువాత ఆ సాయంత్రమే భాను, భరత్ ఇద్దరు కలిసి వెళ్లి మగ పెళ్లివాళ్ళ తరపున మొదటి పెళ్ళి పత్రిక అన్నట్టు ప్రతిమ వాళ్ళింట్లో ఇస్తారు..
మొదటి కార్డ్ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం కావడం తో ఆ పెళ్ళి పత్రికని అందుకున్న శేఖర్, శాంతి దంపతులు నవ్వుతు ఆ కార్డ్ తీసుకెళ్లి దేవుని గదిలో ఉంచి భాను, భరత్ లకి మర్యాదలు చేసి పంపుతారు..
సేమ్ వీళ్ళలానే ఇక్కడ శేఖర్, శాంతి దంపతులు కూడా పెళ్ళి కార్డ్స్ కి పసుపు, కుంకుమ రాసాక ఇంట్లో దేవుని గదిలో, గుళ్లో దేవుని పాదాల దగ్గర పెట్టేసి ప్రణయ్ వాళ్ళింట్లో భరత్, భాను లకి మొదటి కార్డ్ ని అందిస్తారు..
వాళ్లిద్దరూ నవ్వుతు తీసుకుని వాళ్ళు కూడా శేఖర్, శాంతి గార్లకి టీ, స్నాక్స్, జ్యూస్ లు, స్వీట్స్ అంటు మర్యాదలు చేసి పంపుతారు..