తల్లి మాటలు విన్న భాను అదేంటమ్మా అలా అంటున్నావు నాకు బట్టలు తీసుకున్నాను అంటున్నావు మళ్లీ నువ్వు సెలెక్ట్ చేయలేదు అని చెబుతున్నావు..
నాకోసం చీరలు నువ్వు సెలెక్ట్ చేయకపోతే ఇంకెవరు సెలెక్ట్ చేశారు అమ్మ.. శాంతి అత్తయ్య సెలెక్ట్ చేశారా అని అడిగింది..
ఊహు కాదు బాను నీకు చీరలు శాంతి అత్తయ్య తీసుకోలేదు.. నీ మరదలు ప్రతిమ తీసుకుంది యశోద..
యశోద గారి మాటలు విన్న భాను సంతోషంగా అవునా అమ్మ నిజమా నాకోసం చీరలు ప్రతిమ తీసుకుందా అని ఆశ్చర్యంగా అడిగింది..
అవును బంగారం నేనే చెప్పాను ప్రతిమకి వదిన కోసం చీరలు తీసుకో అమ్మ అని.. వెంటనే తన నీకోసం సెలెక్ట్ చేసింది తెలుసా..
చీరలు ఎంత బాగున్నాయో.. నువ్వు వచ్చిన తర్వాత నువ్వే చూస్తావు కదా నీకు కూడా చాలా బాగా నచ్చుతాయి..