భర్త మాటలు విన్న శాంతికి కూడా ఆయన మాటల్లో నిజం ఉందని అనిపించి హ్మ్ నిజమే అండి మీరు చెప్తుంది కూడా వాస్తవమే..
యశోద వదినకి మన కుటుంబం మీద ప్రతిమ మీద ఎంత ప్రేమాభిమానాలు వున్న మనం ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే తన మనసు కూడా మారే అవకాశం వుంది..
ఎవరు మాత్రం కోరి వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకుంటారు చెప్పండి.. మీరు అన్నట్టుగా మన ప్రతిమ ఎలానూ మన మాట జవ దాటదు.. తను వచ్చేసరికి ఇంకో రెండు, మూడు రోజులు పట్టచ్చు..
అలా కాదని ఫోన్ చేసి విషయం చెబుదాం అనుకున్న ఇది ఫోన్ లో చెప్పే విషయం కాదు కదా.. కనుక అమ్మాయి ఇంటికి వచ్చిన తరువాత పెళ్ళి గురించి చెప్పొచ్చు లే…
మంచి అబ్బాయి కాబట్టి ప్రతిమ కూడా కాదు అనడానికి ఏముంది… ఈలోపు మనం ఆలస్యం చేసి మంచి సంబంధాన్ని పోగొట్టుకోకుండా మీరన్నట్టు ముహుర్తాలు పెట్టుకోవడమే మంచిది అని తన ఉద్దేశం చెప్తారు శాంతి..
హ్మ్ ఇలా అన్నావ్ బాగుంది సాయంత్రం బాగుందని పంతులు గారు చెప్పారు యశోద వాళ్ళింటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చూడు అని చెప్తారు శేఖర్..