అప్పటివరకు భాను భరత్ ల గిల్లికజ్జాలను వింటూ హారతి ఇచ్చేటప్పుడు పేర్లు చెప్పడం ఏముందిలే అందరూ ఒకేలా చెప్తారు కదా..
ఇందులో వింత ఏముంది .. అందరూ చెప్పినట్టే చెప్తారు వీళ్లు కొత్తగా ఏమి చెప్పారు కదా అని చాలా తేలిగ్గా తీసుకున్న వాళ్ళందరూ అని చెప్పిన విధానానికి చాలా ఆశ్చర్యపోతారు..
అదే సమయంలో అతని మనసులో ప్రతిమకు ఇచ్చిన స్థానానికి ఎంత గొప్పగా ఆలోచించాడు అని అనుకోకుండా ఉండలేక పోతారు..
తమ్ముడు నోట్లో నుండి అలాంటి మాటలు విన్న భాను కూడా ముందుగా ఆశ్చర్యపోతుంది.. ఆ తరువాత చాలా ఆనంద పడిపోతుంది..
వెంటనే తన భర్త వంక చూస్తూ విన్నారా అది నా తమ్ముడు గొప్పతనం.. ఎంత ఎంత చక్కగా చెప్పాడో విన్నారు కదా..
నా తమ్ముడిలా ఆలోచించడం ఎవరి వల్లా కాదు.. ఈ భాను తమ్ముడు అంటే అలానే ఉంటుంది మరి అన్నట్టు కళ్లు ఎగరేస్తుంది..