అది చూసిన మిగిలిన వాళ్ళందరు వాళ్ళిద్దరూ పిల్లల గురించి ఎత్తగానే సిగ్గు పడుతున్నారు అని చిన్నగా నవ్వుకుంటారు..
కొడుకు, కోడలి సిగ్గు ని కూడా మురిపెం గా చూసుకున్న యశోద గారు నవ్వుతు భాను తల్లి ఇంక చాలు మా..
ఆ భగవంతుడు దయతలిస్తే మీ తమ్ముడు మరదలు త్వరలోనే నువ్వు అడిగిన ఆడపడుచు లాంచ్ నన్ను ఇస్తారు కానీ , నువ్వు వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తేనే కదా నువ్వు అడిగిన దాని గురించి ఆలోచించడానికి అయినా అని అంటారు..
హహహ అలా అంటావా అమ్మ సరే అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి వీళ్ళని లోపలికి వెళ్లడానికి అనుమతిని ఇస్తున్నాను అని నవ్వుతూ ఇప్పటికి లోపలికి వెళ్ళనిస్తున్నాను కదా అని నేను అడిగిన లాంచనం విషయం మర్చిపోకండి..
ఎంత వీలైతే అంత త్వరగా నాకు ఒక బుజ్జి కోడల్ని ఇచ్చేస్తే ఆ తర్వాత తీరిక గా మీరు ఇంకో బుజ్జి పాపాయిని ఈలోకం లోకి తీసుకొద్దురు సరేనా రండి లోపలకి అని పిలుస్తుంది..
ఎందుకో తెలియదు ఆ క్షణం పెళ్లి మీద ప్రణయ్ మీద ఎలాంటి అభిప్రాయం లేకపోయినా సరే భాను మాట్లాడుతున్న మాటలు వింటుంటే తనకే తెలియకుండా ప్రతిమ బుగ్గలు, పింకిష్ గా మారిపోతాయి..