New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 89

మాంగళ్య బంధం – 89

తను కట్టెల పొయ్యి ముందు కూర్చుని  ఒకవైపు కారిపోతున్న చెమట బయట చెంగుతో తుడుచు కుంటూ, మరొక చేత్తో పొయ్యిలో కట్టెలు పెట్టి గొట్టంతో ఊపుతూ ఉన్నట్టుగా వున్న దృశ్యం ఆమె కళ్ళ ముందు కనపడగానే  బాబోయ్ నా పరిస్థితి ఏంటి మరి ఇంత దారుణంగా తయారయ్యింది..

 

ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్ కూడా లేని వాళ్ళు ఉన్నారా.. ఎంత పల్లెటూరు అయితే మాత్రం అందరి ఇళ్లల్లో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా..

 

మరి యశోద అత్తయ్య ఎందుకు ఇంకా గ్యాస్ స్టవ్ ని తెప్పించలేదు అని అనుకుంటూ అంతలో యశోద గారు తనకోసం అక్కడ ఎదురు చూస్తుంటారు అన్న విషయం గుర్తొచ్చి  నేను ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వృధా అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు..

 

పాపం నాకోసం అక్కడ అత్తయ్య ఎదురు చూస్తుంటారు… నేను త్వరగా ఈ నూనె వేడి చేసుకుని వెళ్లాలి  ఎలా నేను ఇప్పుడు ఈ కట్టెల పొయ్యిని  వెలిగించాల ఊహు దీన్ని వెలిగించాలో కూడా నాకు సరిగా రాదే..

 

దీనితో పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈ పని పూర్తి చేసినట్టే  అని చిన్నగా నిట్టూర్చి  హ్మ్ ఉదయం భాను వదిన  వంటింట్లోకి కాకుండా బయట  స్టవ్ దగ్గరికి తీసుకెళ్లింది ఇందుక..

 

అప్పుడు వదిన అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు.. ఇప్పుడు ఇక్కడ ఈ కట్టెల పోయిన చూస్తే గాని విషయం  ఇదని తెలియలేదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue