హైదరాబాద్‌లోని రాజభవనం నుండి ఇషాంత్ తన లగ్జరీ కారులో మైరాను తీసుకుని బయలుదేరాడు.
దేవిక గారు బయట నిలబడి కారు వెళ్లే వరకు చూస్తూనే ఉన్నారు. కారులో ఇషాంత్ ముఖం కోపంతో ఎర్రబడి ఉంది.
రాత్రి మైరా తన మీద తిరగబడిన విషయాన్ని వాడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. నా సామ్రాజ్యంలో నాకే ఎదురు చెబుతుందా?
దీని పొగరు ఈరోజే అణచాలి అని వాడు స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.మైరా మాత్రం కిటికీలోంచి బయటకు చూస్తోంది.
లోపల గుండె వణుకుతున్నా, పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తోంది. నగరం దాటి కారు అడవికి సమీపంలో ఉన్న ఒక కొండ ప్రాంతం వైపు సాగింది.
అక్కడ ఒంటరిగా ఉన్న ఒక భారీ గెస్ట్ హౌస్ ముందు కారు ఆగింది. అక్కడ పనివాళ్లు ఎవరూ లేరు, కేవలం ఇషాంత్ పర్సనల్ బాడీగార్డ్స్ గేటు దగ్గర మాత్రమే ఉన్నారు.