బెడ్‌రూమ్ లోని ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా పేలిపోయింది. మైరా తన గొంతు పెంచి, ఇన్నాళ్ల భయాన్ని పక్కన పెట్టి ఈశాంత్ కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే, ఈశాంత్ కి ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది.
తన ముందు పిల్లిలా వణికిపోయే ఈ మైరా, ఈరోజు పులిలా గర్జిస్తుందా,తననే ఎదురించి మాట్లాడుతుందా అతని అహానికి అది పెద్ద దెబ్బలా తగిలింది.
ఏంటే.. వాయిస్ పెంచుతున్నావు,నా ముందే కుప్పిగంతులు వేస్తూ పిచ్చి వేషాలు వేస్తున్నావా అని ఈశాంత్ గర్జించాడు.
కానీ మైరా తగ్గలేదు. రండి ఈశాంత్ గారు మీ అమ్మగారు వస్తారు, అప్పుడు జరిగిందంతా కళ్ళకు కట్టినట్టు చెప్తాను.
మీ అసలు స్వరూపం బయటపెడతాను అని సవాలు విసిరింది.ఆ మాటతో ఈశాంత్ కి తిక్క రేగింది. మైరాను అమాంతం తన వైపుకు లాక్కున్నాడు.
ఆమె ఊపిరి సలపనంత బిగువుగా పట్టుకుని, ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో ప్రేమ లేదు, కేవలం పంతం మాత్రమే ఉంది. చివరగా ఆమె పెదవిని గట్టిగా కొరికి వదిలేశాడు.