రాత్రంతా ఆ మంచు గడ్డల మీద గడపడం వల్ల మైరా శరీరం పూర్తిగా నీలం రంగులోకి మారిపోయింది.
తెల్లవారుజామున ఇషాంత్ ఆమెను మంచం మీద పడేసి వెళ్ళిపోయాడు కానీ, ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వాడు గమనించలేదు.
మైరా ఒళ్లంతా నిప్పులా కాలిపోతోంది. విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోంది.
కనీసం కళ్ళు తెరిచి చూసే స్థితిలో కూడా ఆమె లేదు.
ఇషాంత్ ఉదయం లేచి, బద్దకంగా ఒళ్లు విరుచుకుని, మైరా వైపు ఒక్కసారి కూడా చూడకుండా రెడీ అయిపోయాడు.
నాటకాలు ఆడుతోంది.. కాసేపటికి అదే లేస్తుందిలే అని మనసులో అనుకుంటూ, తన లాప్టాప్ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు.
గెస్ట్ హౌస్ లో కేవలం మైరా ఒంటరిగా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.