మరుసటి రోజు ఉదయం ఎప్పుడూ లానే సూర్యుడు తన కాంతులతో కిటికీని దాటి గదిలోకి దూకుతూ నిద్ర లేపుతాడేమో అనుకునేసరికి…ఆయన అంచనాలను తారు మారు చేస్తూ మబ్బుల చాటున దాక్కునేసరికి…అగస్త్య కి ఇంకా మత్తుగా నిద్రపోతాడు…
అటు వైపు అలకనంద ఉరుముల సడికి కాస్త అటు ఇటు కదిలిన తనకి ఒకేసారి మట్టి సువాసన ముక్కుకి తాకగానే కళ్ళు తెరిచి చూస్తుంది…సమయం ఆరు కి దగ్గరలో ఉన్న చీకట్లు ముసురుకునట్టుగా ఉన్న వాతావరణానికి…జాగ్రత్తగా ఒక్క చేత్తో విరబోసిన జుట్టుని ముడి వేసుకుని….బయటకి వస్తుంది…అప్పటికి ఇంకా మార్నింగ్ షిఫ్ట్ సెక్యూరిటీ రాకపోతే..
నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ ఎక్కడికి అక్కడి నిద్రపోతూ కనిపించేసరికి…ఇదే మంచి సమయం అనుకుని…. తన పాదాలని అప్పుడే తడి తడిగా ఉన్న… ఆ నెల మీద పెట్టగానే…ఒకేసారి తన ఒంట్లో ఎనర్జీ పాస్ అయితే….
మెల్లిగా అడుగులు వేసుకుని తల పైకి ఎత్తి చూసిన తనకి చినుకు బుగ్గ మీద పడగానే…తన పెదాలు విచ్చుకుంటే…కొంచెం లూస్ గా మోడి వేసిన జుట్టు కాస్త మెలికలు తిరుగుతూ….విరబోసుకుంటే….తన రెండు చేతులని చాచి ఆ వర్షం లో తడుస్తున్న తనకి మొదటి సారి స్వేచ్ఛగా అనిపిస్తుంటే… ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియక…తన చేతులను అటు ఇటు కదుపుతూ….మొత్తం తన కుడి చేతితోనే నాట్యం చెయ్యడం మొదలు పెడుతుంది…
అప్పుడే కొంచెం కొంచెంగా మెలుకువ రావడం అగస్త్య వర్షపు జల్లుల శబ్దానికి బాల్కనీ లోకి వచ్చి….
ఎదురుగా పడుతుం వర్షాన్ని చూసి బ్రుకుటి ముడి వేస్తూ….”ఇంత సడన్గా వర్షం ఏంటో!!?”అని అనుకుని…కళ్ళు కాస్త కిందకి దించేసరికి…