కధకి సూట్ కానీ హీరోయిన్స్ ని పెట్టుకొని సినిమాని పాడు చేసుకోదల్చుకోలేదు.. అందుకే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నా అమ్మాయిల దగ్గరకి వెళ్లి ఒకసారి ఆడిషన్స్ కి రమ్మని పాంప్లెట్స్ పంచాలి.
మీరు సినిమా ఓకే చేస్తే నెక్స్ట్ ప్లాన్ అదే.” అని అన్నాడు విశ్వనాథ్.
“100 కి 200% నేను సినిమా చేస్తాను సార్.. కాకపోతే మీరు సినిమా స్టార్ట్ చేసే ఒక్క వన్ మంత్ ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి,కాల్ షీట్స్ ఇబ్బంది రాకుండా ఉంటుంది.” అని అన్నాడు ఆనందంగా శివ్.
“తప్పకుండా సార్.” అని అన్నాడు సగం సినిమా సక్సెస్ అయినంత ఆనందంలో విశ్వనాథ్.