“మావయ్య నాకు భయం వేస్తుంది మావయ్య…. మావయ్య కళ్ళు తెరువు మావయ్య..” అని పిచ్చిదానిలా పెద్ద పెద్దగా ఆరుస్తూ ఏడుస్తున్న రోజా గొంతు విని బయట సాయంత్రం పూట అందరూ మాట్లాడుకోవడానికి కూర్చునే అరుగుల మీద ఉన్న వాళ్ళు పరుగున సురేష్ ఇంటికి పరిగెత్తారు..ఏమైంది ఈ పిల్ల ఇంత పెద్దగా ఏడుస్తుంది అని కంగారుగా.
వచ్చినవాళ్లు సురేష్ ని చూసి భయంగా మగవాళ్ళు నలుగురు కాళ్లు చేతులు పట్టుకొని చావిడిలో నుంచి బయటకి తీసుకువచ్చారు..వాళ్ళ వెనకనే ఏడుస్తూ రోజా కూడా వచ్చింది.
కాటు వేసిన పాము కొరలా గుర్తులను చూసి ముక్కు దగ్గర వేలు పెట్టి అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు..”కాటు వేసింది రక్తపింజరా.. క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి.” అని అన్నారు బాధగా.
“హాస్పటల్ కి తీసుకు వెళ్దామా పెదనాన్న..” అని అంది ఏడుస్తూ రోజా అక్కడ ఉన్న ఒక పెద్ద వయసు వ్యక్తిని చూస్తూ.