రోజా – 5
పెళ్లి మాట వచ్చేసరికి సహజంగానే ఆడపిల్లకి ఉండే సిగ్గు తొంగి చూసింది రోజా బుగ్గల్లో.
కాలేజ్ ముందు బండిని ఆపాడు సురేష్.
బండి దిగి..”వెళ్ళొస్తాను మావయ్య.” అని అంది రోజా.
“పరీక్ష బాగా రాయి తల్లి.. నీ పరీక్ష సమయం అయిపోయాక నేను వస్తాను నిన్ను తీసుకు వెళ్ళడానికి.” అని అన్నాడు బండిని రిటర్న్ చేసుకుంటూ సురేష్.
“సరే మావయ్య..” అని చెప్పి ఎగ్జామ్ టైం అవుతుంది అన్నదానికి సూచనగా మొదటి బెల్ కొట్టగానే పరుగున కాలేజ్ లోకి వెళ్ళింది రోజా.. ఆలస్యం అయితే గేటు వేసేస్తారని.
రోజా వెళ్ళిన వైపే చూస్తూ..’మీ అమ్మ నా నుంచి తీసుకున్న మాట నిన్ను జాగ్రత్తగా చూసుకొని,మా అందరిని మరిపించే ఒక మంచి అయ్య చేతిలో పెట్టమని,దానిని నేను నెరవేర్చాలి తల్లి..’ అని అనుకున్నాడు బండిని అక్కడ నుంచి కదిలిస్తూ సురేష్.
“సర్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు మీకు ఏదో స్టోరీ చెప్పాలి అంట.” అని అన్నాడు పి ఏ శివ్ వైపు చూస్తూ.
“ఈరోజు రాజా గారి సినిమా షూటింగ్ తర్వాత కలవమని చెప్పు డైరెక్టర్ విశ్వనాధ్ గారిని.” అని అన్నాడు తన డైలాగ్స్ చూసుకుంటూ శివ్.
“ఈవినింగ్ 7 తర్వాత ప్యాకప్ అయిపోయి మనం ఇంటికి వచ్చేస్తాం కదా సార్.. ఇక్కడకి రమ్మని చెప్పాలా మరి విశ్వనాథ్ గారిని.” అని అన్నాడు పి ఏ శాస్త్రి.
“హుమ్మ్..” అని అన్నాడు డైలాగ్స్ చూసుకొని పైకి లెగుస్తూ శివ్.
శాస్త్రి వెంటనే విశ్వనాథ్ గారి పి ఏ కి మెయిల్ చేశాడు.. ఈవినింగ్ 7:30 కి శివ్ సార్ వాళ్ళ ఇంట్లో మీట్ అవ్వమని.
శివ్ తన మేకప్ నుంచి హాల్లోకి వచ్చేసరికి **వుడ్ డైరెక్టర్ అనన్య కి అడ్వాన్స్ ఇవ్వడం కనిపించింది.. సైలెంట్ గా ఆ డైరెక్టర్ కి నమస్తే చెప్పి బయటకి వచ్చాడు.
“మేడం వీలైతే సెకండ్ హీరోగా మీ హస్బెండ్ ని కూడా మాట్లాడదాము అనుకున్నాను.” అని అన్నాడు డైరెక్టర్ బయటకు వెళ్లిన శివ్ వైపు చూస్తూ.. నిజానికి శివ్ ని సెకండ్ హీరోగా పెట్టుకోవాలి అంటే అనన్య ని ఒక హీరోయిన్గా తీసుకోవాలి అనుకొని వచ్చాడు ఆ డైరెక్టర్.. ఆ విషయం రాత్రి తన పీఏ ద్వారా తెలుసుకున్న శివ్ తను మాట్లాడితే డైరెక్టర్ ఆ విషయం అడుగుతాడు అని తెలిసే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
“జస్ట్ వెయిట్ సర్ ఆయనని పిలుస్తాను మీరే మాట్లాడండి.” అని అంది సంతోషంగా అనన్య శివ్ కి కాల్ చేస్తూ.
తన పాచిక పారినందుకు సంతోషంగా ఉన్నాడు ఆ డైరెక్టర్.
కార్లో కూర్చున్న శివ్ కి కాల్ రావడంతో విషయం అర్థం చేసుకొని..ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వేరే ఇండస్ట్రీ డైరెక్టర్ ముందు ఇద్దరము చులకన అవుతాము అని ఆలోచించి ఫోన్ లిఫ్ట్ చేసాడు శివ్.. “హలో..!” అని అంటూ.
“డైరెక్టర్ గారు మీతో ఏదో మాట్లాడాలి అంట ఒక్కసారి ఇంట్లోకి రండి.” అని అంది చాలా సున్నితంగా అనన్య..ఎదురుగా మరి డైరెక్టర్ గారు ఉన్నారుగా.
వెళ్లడం తప్పదు అని ఆలోచించిన శివ్.. “జస్ట్ వెయిట్ వస్తున్న.” అని కాల్ కట్ చేసి అసహనంగా కారు దిగి ఇంట్లోకి అడుగు పెట్టాడు.
“ఫ్యూ సెకండ్ సార్ వచ్చేస్తున్నారు.” అని అంది చిరునవ్వుతో డైరెక్టర్ ని చూసి అనన్య.
“ఓకే మేడం..” అని అన్నాడు ఆనందంగా డైరెక్టర్.. ఇక్కడ సూపర్ స్టార్ ని తీసుకువెళ్లి మా సినిమాలో సెకండ్ హీరోగా పెడితే ఇక్కడ ప్రేక్షకులు కూడా చూసి సూపర్ డూపర్ హిట్ చేస్తారు..అన్ని భాషల్లో ఒకటేసారి రిలీజ్ చేస్తే జాక్పాట్ కొట్టినట్టే అని లెక్కలు కూడా వేసేసాడు డైరెక్టర్ అప్పుడే.
డైరెక్టర్ కి మళ్ళీ నమస్కారం చేసి అనన్య పక్కన కూర్చున్నాడు శివ్..”ఏంటి సార్…?” అని అంటూ.
“ఈ మంత్ ఎండింగ్ ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాము సార్ అందులో మీ వైఫ్ అనన్య మేడంని కూడా సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నాము.
ఫస్ట్ **వుడ్ సినిమా కాబట్టి సెకండ్ హీరోయిన్.. కానీ..! నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అనన్య మేడం ఫస్ట్ హీరోయిన్ గా ఉంటుంది.. అలాగే మీరు కూడా మా సినిమాలో సెకండ్ హీరోగా చేస్తే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని కూడా మెయిన్ లీడ్ గా పెట్టి సినిమా తీస్తాము సార్.. ఒకసారి స్టోరీ లైన్ వినండి.” అని అన్నాడు చాలా రిక్వెస్టింగా డైరెక్టర్.
“ఎక్స్ట్రీమ్లీ సారీ సార్.. మీరు కనీసం నిన్న వచ్చి నాకు స్టోరీ చెప్పినా లేదా ఒక్క మాట చెప్పిన నేను ఆగే వాడిని.. కానీ..! నిన్ననే నేను ఒక డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇచ్చేసాను.
***
ఈ స్టోరీ ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి యార్.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages