వద్దన్నా వదిలేస్తానా. @12 భానుమతి ఎన్ని ఆంక్షలు పెట్టిన.. బయటకు వెళ్తున్నానని చెప్పో,లేదంటే ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి అని చెప్పో,చదువుకోవడానికనో లేదా ట్యూషన్ పేరు చెప్పో ఇలా ఏదో ఒక వంకతో మహిమ ని కలవడానికి వెళ్ళేవాడు విరాట్. విరాట్ తల్లి కళ్ళు కప్పి మహిమని కలవడానికి వెళ్తున్న విషయం ఇటు జనార్ధన్ కి అటు కాత్యాయినికి తెలిసినా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు.. మహిమ చిన్నప్పటినుంచి కొంచెం నెమ్మదస్తురాలే.. పల్లెటూరు న…